– ఆర్ డబ్ల్యు ఎస్ ఏ ఈ నయూమ్
నవతెలంగాణ – జుక్కల్
ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సర్వసాధారణం. కానీ బదిలీపై వెళ్లడం బాధాకరంగానే ఉంది అని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నయూమ్ అన్నారు. శుక్రవారం చుక్కల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని 30 గ్రామపచాయతీల సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, జెడ్పిటిసిలు, జిపి కార్యదర్శులు, మార్కెట్ కమిటీ చైర్మన్, గ్రామీణ నీటి పారదల శాఖ సిబ్బంది జర్నలిస్టులు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సాయి గౌడ్ మాట్లాడుతూ.. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గా మొదటగా జుక్కల్ ప్రాంతంలో డ్యూటీ రాగానే సంతోషంగా ఉన్నప్పటికీ మారుమూల ప్రాంతం కావడంతో కొంత ఇబ్బందిగా మారిందని అన్నారు. తరువాత సుమారు 7 సంవత్సరాలుగా మండలానికి ఎనలేని సేవలందించి గ్రామాలలోని నీటి సమస్యలను తీర్చడంలో తనవంతుగా కృషి చేశారని కొనియాడారు.
అనంతరం బీఆర్ఎస్ లాడేగాం సర్పంచ్, రాజశేఖర్ పటేల్ మాట్లాడుతూ .. ఉద్యోగరీత్యా కృషి చేయడం సమస్యలు పరిష్కరించడంలో ఓర్పు, సహనం, ప్రజలతో మమేకమై ఎవరి మనసు నొప్పించకుండా జుక్కల్ మండలంలో ఇప్పటివరకు గత చరిత్రలో ఎంతోమంది ఏ ఈలుగా వచ్చారు. కానీ సమస్యలు ఎక్కడి అక్కడే ఉండేవి అని తెలిపారు. ఏఈగా చార్జీ తీసుకున్న నాటినుండి గ్రామాల్లోని సమస్యలను క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించడం నేరుగా ప్రజలతో మమేకమై స్థానిక ప్రజాప్రతినిధులు, యువకులు, గ్రామ పెద్దలతో మాట్లాడి సమస్యలను పరిష్కరించి నీటి సమస్య కొరత లేకుండా రాత్రింబవళ్లు కష్టపడిన అధికారికి జుక్కల్ మండల ప్రజలు ఎంత చేసినా తక్కువేనని అన్నారు.
ఖండేబల్లూరు సర్పంచ్ చాకలి కృష్ణ మాట్లాడుతూ.. మొదటగా ఏ ఈ చార్జి తీసుకున్నప్పుడు కొంత ఇబ్బంది పెట్టిన మాట వాస్తవాన్ని అయినా.. తన మంచితనాన్ని గుర్తించలేకపోయామని, కొన్ని రోజుల తర్వాత గుర్తించిన మేము తనకు సహకరించి మర్చిపోలేకుండా జుక్కల్ వదిలి వెళ్లడం బాధాకరంగా ఉందని ఆయన తెలిపారు. మాజీ జెడ్పిటిసి మాధవ దేశాయి మాట్లాడుతూ.. ప్రతి ఎండాకాలం వచ్చిందంటే మా గ్రామానికి నీటి ఎద్దడి ఉండేదని, సారు వచ్చిన తర్వాత తమ సమస్యలు పూర్తిగా తొలగిపోయాయని చెప్పారు.
మాజీ సర్పంచ్ రాములు సేట్ మాట్లాడుతూ.. జుక్కల్ మండల కేంద్రంలో గల్లి గల్లి లో నీటి సమస్య ఉన్నప్పుడు తాము నేరుగా మాట్లాడి సమస్యలు పరిష్కరించుకోవడం జరిగిందని అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ బోడ సాయిలు మాట్లాడుతూ.. ప్రస్తుతం జుక్కల్ మండల కేంద్రంలో నీటి సమస్య లేకుండా తాను ఎంతగానో కృషిచేసి, పాత నీటి ట్యాంకులను తొలగించి కొత్త వాటిని ఏర్పాటు చేయడం జరిగిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు రాజశేఖర్ పటేల్, చాకలి కృష్ణ, మారుతి, మాజీ జెడ్పిటిసి మాధవరావు దేశాయ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయ గౌడ్, మాజీ సర్పంచులు వినోద్, చదువు పటేల్, ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది బాలు , మారుతి , సవిత , బాలాజీ , యాదవ్ , బాలయ్య, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.



