Friday, June 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వలస వెళ్లిన సమాచారం లేకనే ఇబ్బందులు

వలస వెళ్లిన సమాచారం లేకనే ఇబ్బందులు

- Advertisement -

– మండలంలో సెన్సెస్ సర్వే విజయవంతంగా పూర్తి చేయాల
నవతెలంగాణ – జుక్కల్ 

మండలంలోని సెన్సెస్ సర్వీస్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగించాలని జుక్కల్ ఎమ్మార్వో మారుతి అన్నారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెన్సెస్ సర్వే చేస్తున్న సూపర్వైజర్లు, ఇమినేటర్స్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ గ్రామాలలో సర్వే పకడ్బందీగా నిర్వహించి విజయవంతంగా ముగించాలని అన్నారు. అనంతరం సెన్సెస్ సర్వే నిర్వహిస్తున్న సూపర్వైజర్లు మరియు ఇమ్యూనిటీస్ మాట్లాడుతూ గ్రామాలలో చాలామంది నిరుపేదలు కావడంతో పనులు లేక పట్టణాలలో పనులు చేయడానికి వలస వెళ్లడం జరిగిందని, అటువంటి ఇండ్లకు వెళ్లినప్పుడు తాళం వేసి ఉండడంతో వారి సమాచారం లభించడం లేదని అన్నారు.

గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ఉన్నవారు పనులు లేక పట్టణాలకు వెళ్లినప్పుడు గ్రామంలోని పక్కింటి వారు లేదా గ్రామాల సర్పంచులు ఇమ్మినేటర్లను సహకరించాలని, వారి సాయం తీసుకోవాలని ఎమ్మార్వో ఇమ్యూనిటర్ లకు సూచించారు. రాబోయే తొమ్మిదవ తారీకు లోపు సర్వే పనులు విజయవంతంగా నిర్వహించి వివరాలను అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మార్వో తో పాటు, డిప్యూటీ తహసిల్దార్ హేమలత, సీనియర్ అసిస్టెంట్ మోహన్ , సిబ్బంది, సర్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -