అల్లం స్వప్న – బాలకిషోర్ రెడ్డి మానవతా స్పందన
నవతెలంగాణ – గీసుగొండ
మండలంలోని మనుగొండ గ్రామానికి చెందిన గుండ కములమ్మ ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న వెంటనే అల్లం స్వప్న – బాలకిషోర్ రెడ్డి కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు. వారి ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ పేర్ల శ్రవణ్ శుక్రవారం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం అల్లం బాలకిషోర్ రెడ్డి పంపించిన రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. బాధిత కుటుంబం ఎదుర్కొంటున్న విషాద సమయంలో తమవంతు సహాయం చేయడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.
సర్పంచ్ పేర్ల శ్రవణ్ మాట్లాడుతూ.. కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, భవిష్యత్తులో ఎలాంటి అవసరం వచ్చినా నిర్భయంగా తమను సంప్రదించాలని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ప్రజల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ భాగస్వాములమనే సంకల్పంతో అల్లం స్వప్న – బాలకిషోర్ రెడ్డి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. బాధలో ఉన్న కుటుంబాలకు భరోసాగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా అల్లం బాలకిషోర్ రెడ్డి పేర్కొన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కనకయ్య, మాదాసి రాంబాబు, బుస్సాని సాంబయ్య, కందికొండ రాజు, గాడుదుల బొందాలు, తోట కమలాకర్, బిట్ల శివప్రసాద్, కనుమల్ల అనిల్, దోమ శ్రీను, గుండా శ్రీను, క్రాంతి రణధీర్ తదితరులు పాల్గొని మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు.



