Monday, February 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డ్రగ్స్ అమ్మినా.. కొనుగోలు చేసినా రూ.2 లక్షల జరిమానా

డ్రగ్స్ అమ్మినా.. కొనుగోలు చేసినా రూ.2 లక్షల జరిమానా

- Advertisement -

– బషీరాబాద్ పంచాయతీ గ్రామ సభలో తీర్మానం 
నవతెలంగాణ కమ్మర్ పల్లి 
గ్రామంలో డ్రగ్స్ అమ్మిన, కొనుగోలు చేసిన రూ.రెండు లక్షల జరిమానా విధించాలని బషీరాబాద్ గ్రామపంచాయతీ గ్రామసభలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. సోమవారం మండలంలోని బషీరాబాద్ గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ బైకాన్ జమున మహేష్ అధ్యక్షన పంచాయతీ గ్రామసభను నిర్వహించారు. గ్రామ సభలో గ్రామస్తుల నిర్ణయం మేరకు పలు తీర్మానాలను చేశారు. గ్రామాన్ని మత్తు పదార్థాల నియంత్రణ, ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని తీర్మానించారు. అందులో భాగంగా గ్రామంలో ఎవరైనా డ్రగ్స్ అమ్మిన కొనుగోలు చేసిన రెండు లక్షల జరిమానా విధించాలని, సదరు వ్యక్తులను పోలీసులకు అప్పగించాలని గ్రామ సభలో ఏకగ్రీవంగా తీర్మానించినట్లు సర్పంచ్ బైకాన్ జమునమహేష్ తెలిపారు.

అదేవిధంగా గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు.అంతకుముందు గ్రామపంచాయతీ ఆదాయ వ్యాయాలను పంచాయతీ కార్యదర్శి బాస నరేందర్ గ్రామసభలో చదివి వినిపించారు. ఈ గ్రామసభ సమావేశంలో ఉపసర్పంచ్ చిలువేరు భూమేశ్వర్, వార్డు సభ్యులు రమేష్, రాజేందర్, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -