Saturday, June 6, 2026
E-PAPER
Homeసినిమాప్రేమ కంటే గొప్ప యుద్ధం లేదు

ప్రేమ కంటే గొప్ప యుద్ధం లేదు

- Advertisement -

మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘లెనిన్’.అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రలలో నటించిన ఈ మూవీకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈనెల 26న థియేటర్లలో ఘనంగా విడుదల కానుంది. ‘పెద్ది’ సినిమా ప్రస్తుతం థియేటర్లో సందడి చేస్తోంది. ఈ సినిమా ప్రదర్శనలకు ‘సోల్ ఆఫ్ లెనిన్’ను జోడించారు. ఈ ఉద్వేగ భరితమైన, పవర్ ఫుల్ పాటకు బ్లాక్‌బస్టర్ స్పందన లభించింది. ఈ పాటలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే మధ్య ఉండే ప్రేమ, వారి బాండింగ్‌ను చక్కగా చూపించారు. ‘ప్రేమ కంటే గొప్ప యుద్ధం లేదు’ అనే క్యాప్షన్‌తో ఈ పాట సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. తమన్ స్వరపరిచిన ఈ పాట ప్రేక్షకులను కట్టిపడేస్తోంది అని మేకర్స్ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -