దర్శకుడు అనిల్ రావిపూడి అసోసియేట్, ఆయన అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సహ రచయితగా పని చేసిన ఎస్ కృష్ణ ‘హై’ అనే ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రచయిత, నటుడు, సహ నిర్మాతగా కూడా పనిచేస్తున్నారు. ఇమేజ్‌స్పార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, మైరా క్రియేషన్స్ పై హరీష్ పెద్ది, ఎస్ కృష్ణ, శేఖర్ దివ్వెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనన్య శర్మ, ఎస్ కృష్ణ, పల్లవి దొర, కృష్ణ కమల్, సాయి కృష్ణ, రేవంత్ (బుల్లిరాజు) ఈ చిత్రంలో ప్రధాన తారాగణం. ఈ చిత్ర టీజర్‌ను వెంకటేష్ సోమవారం లాంచ్ చేశారు. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ,’సాయి ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. తను మంచి టెక్నీషియన్‌గా ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో ఉండాలని కోరుకుంటున్నాను.
తను యాక్టర్‌గా కూడా సక్సెస్‌ఫుల్ అయ్యాడు. నాతో ఉన్నప్పుడు ఒక రకమైన సాయిని చూశాను, తను సినిమా చేసిన తర్వాత మరొక సాయి కనిపించాడు. మంచి జడ్జిమెంట్ ఉన్న టెక్నీషియన్. ఒక కొత్త జోనర్‌లో డిఫరెంట్ స్క్రీన్‌ప్లే తో తీసిన సినిమా ఇది. ఆడియన్స్ చూసిన తర్వాత తన ప్రయత్నాన్ని కచ్చితంగా ఆదరిస్తారు. మ్యూజికల్‌గా కూడా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. హైదరాబాద్ లైవ్ లొకేషన్స్‌లో తీశారు. సినిమా డబుల్ పాజిటివ్ చూశాను. అద్భుతంగా ఉంది’ అని తెలిపారు. ‘అనిల్‌తో పాటు సాయితో కూడా మాకు జర్నీ ఉంది. స్క్రిప్ట్ విషయంలో, సినిమా విషయంలో అనిల్‌తో ఫైట్ చేసే కెపాసిటీ ఉన్న వ్యక్తి సాయి. ఇంత మందిని ఇంట్రడ్యూస్ చేయడం అనేది రియల్లీ హాట్సాఫ్.
ఈ సినిమా అందరికీ హై రావాలని కోరుకుంటున్నాను’ అని ప్రొడ్యూసర్ దిల్ రాజు చెప్పారు. ప్రొడ్యూసర్ సురేష్ బాబు మాట్లాడుతూ, ‘సాయి అనిల్ రియల్ ట్రూ ఫ్రెండ్స్. వెంకటేష్‌తో సినిమా చేస్తున్నప్పుడు వాళ్ళ వర్కింగ్ స్టైల్ చూశాను. సాయి చాలా ప్యాషన్ పర్సన్. తన ప్రయత్నంకి తప్పకుండా మంచి ఫలితం వస్తుంది’ అని అన్నారు. యాక్టర్, డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎస్. కృష్ణ మాట్లాడుతూ. ‘ఈ సినిమా చూసే వాళ్ళకి మంచి హై ఇస్తుంది. వికాస్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. టీజర్ చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే మూవీ ఇది’ అని చెప్పారు. నిర్మాత హరీష్ పెద్ది మాట్లాడుతూ,’ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. ఆడియన్స్‌కి థియేటర్స్‌లో చూస్తున్నప్పుడు కచ్చితంగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది’ అని చెప్పారు.
డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో ‘హై’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



