Saturday, June 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వార్డుల పరిశుభ్రతతోనే పట్టణం ఆదర్శం 

వార్డుల పరిశుభ్రతతోనే పట్టణం ఆదర్శం 

- Advertisement -

– పురపాలక సంఘం చైర్ పర్సన్ దండి లక్ష్మి 
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ 

హుస్నాబాద్ పట్టణంలోని ప్రతి వార్డు పరిశుభ్రత ఉంటేనే హుస్నాబాద్ ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుకోవచ్చని హుస్నాబాద్ పురపాలక సంఘం చైర్ పర్సన్ దండి లక్ష్మి అన్నారు. శనివారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 2,11,13,15,18 వార్డులలో వార్డు సభలు నిర్వహించారు. అనంతరం వార్డులలోని రోడ్ లు శుభ్రపరచారు. డ్రైనేజీలు క్లీన్ చేయడం, మొక్కలు నాటడం, స్ప్రే చేయించడం, బ్లీచింగ్ చల్లించడం లాంటి కార్యక్రమాలు చేపట్టారు.

సందర్భంగా  చైర్ పర్సన్  మాట్లాడుతూ పట్టణ ప్రజలందరూ వ్యక్తిగత శుభ్రత తో పాటు పట్టణ పరిశుభ్రత కోసం భాగస్వాములు కావాలని కోరారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ప్రకారం చెత్తను నాలుగు రకాలుగా వేరు చేసి పురపాలక సంఘ వాహనానికి అందించాలని తెలిపారు. వార్డ్ సమస్యలు ఉంటే తమ దృష్టి కి తీసుకొని రావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ తాటి మల్లికార్జున్ , వైస్ చైర్ పర్సన్ చిత్తారి పద్మ , కౌన్సిలర్స్ బూరుగు లత ,పి వరప్రసాద్, బొల్లి శ్రీనివాస్ ,ఆకుల రజిత ,వాల సుప్రజ , శానిటర్ ఇన్స్పెక్టర్ బాల ఎల్లం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -