Saturday, June 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామ ప్రజలకు 500 స్టీల్ ప్లేట్లు పంపిణీ చేస్తా: సర్పంచ్

గ్రామ ప్రజలకు 500 స్టీల్ ప్లేట్లు పంపిణీ చేస్తా: సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ-జక్రాన్ పల్లి
మండలంలోని చింతలూరులో జరిగిన గ్రామ సర్పంచ్ నాగుల శ్రీనివాస్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలినినో ప్రభావం గురించి, ప్లాస్టిక్ నిషేధం గురించి వివరించారు. ఈ క్రమంలో గ్రామ ప్రజల మేలు కోసం 500 స్టీల్ ప్లేట్స్ విరాళంగా అందజేస్తానని ఆయన ప్రకటించారు. అనంతరం ఎస్సై మహేష్  మాట్లాడుతూ సైబర్, డ్రగ్స్ వాహన దారుల భద్రత గురించి అవగాహన కల్పించారు. అనంతరం జాతీయ కుటుంబ ప్రయోజన పథకంలో భాగంగా రూ.20,000/- చొప్పున నలుగురు లబ్దిదారలుకు ప్రోసిడింగ్ కాపీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మహేష్, మండల్ స్పెషల్ ఆఫీసర్ ప్రవీణ్, ఎంపీవో రాజేష్, ఉపసర్పంచ్ బాలకృష్ణ వార్డు సభ్యులు గ్రామస్తాయి అధికారులు, మహిళలు  వీడీసీ సభ్యులు గ్రామప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -