ఖమ్మం వరంగల్ రహదారిపై వాహనదారుల ఇబ్బందులు..
నవతెలంగాణ-వర్ధన్నపేట
వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి పక్కన పంట పొలాల్లో కొందరు నిప్పు పెట్టడంతో రహదారిపై వెళ్తున్న వాహనదారులకు పొగ మంటలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండిన పొలాల్లో చెత్త గడ్డిని కాలబెట్టాలని కొందరు చేసిన నిర్వాకం వల్ల వరంగల్ ఖమ్మం ప ప్రధాన రహదారిపై వెళ్తున్న వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దట్టమైన పొగతో వాహనదారుల ఊపిరి బిగబట్టి వాహనాలు నడుపుతున్నారు. పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల భూసారం దెబ్బతినడమే కాకుండా, పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని, అధికారులు సూచిస్తున్నప్పటికీ ఎండిన పొలాల్లో మంటలు మాత్రం ఆగడం లేదు. సంబంధిత వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు, వాహనదారులు కోరుతున్నారు.
ఎండిన పొలాల్లో మంటలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



