Sunday, June 7, 2026
E-PAPER
Homeజాతీయంగ్యాస్ బాదుడు

గ్యాస్ బాదుడు

- Advertisement -

ఎల్పీజీ సిలిండర్ కు రూ.29 పెంపు
ఎన్నికల తర్వాత జనంపై ఆగని భారాలు

న్యూఢిల్లీ : ఇన్నాళ్లు కేంద్రం చమురు ధరలు పెంచుతూ.. ఇప్పుడు అమాంతంగా గృహవినియోగ గ్యాస్ 14.2 కేజీల సిలిండర్ ధరను దేశవ్యాప్తంగా రూ. 29 పెంచింది. దీంతో ఢిల్లీలో గ్యాస్ ధర రూ. 913 నుంచి రూ.942 కు పెరగనున్నది. హైదరాబాద్ లో రూ.965గా ఉండగా.. పెరిగిన ధరతో 994కు చేరింది. మూడు నెలల వ్యవధిలో ఇది రెండోసారి పెంపు కావటం గమనార్హం. మార్చి 7న సిలిండర్‌కు రూ. 60 పెంచాక..తాజా పెంపుతో గృహిణులపై అదనపు భారం పడనున్నది. ఇంధన ధరలు విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఎల్పీజీ ధరల సవరణ జరిగిందని చమురు సంస్థలు తెలిపాయి. మే మధ్య నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు మొత్తం రూ. 7.50 పెరగగా, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) ధర కిలోకు సుమారు రూ. 6 పెరిగిందని నివేదించాయి. పశ్చిమ ఆసియాలో అంతరాయాలు ఉన్నప్పటికీ చమురు కానీ, గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఆటంకాలు ఎదురవటంలేదు. అయితే చమురు సంస్థలకు లాభాలు వచ్చినపుడు ఏ మాత్రం తగ్గించ కుండా.. ఇపుడు నష్టాలు వచ్చాయంటూ.. సామాన్య, మధ్యతరగతి వినియోగదారులపై ఎల్పీజీ భారాలు మోపటం పై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -