- Advertisement -
విద్యాశాఖ ఉత్తర్వులు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని పాఠశాలల్లో ఈనెల15న బడి గంట మోగనుంది. ఈనెల 12వ తేదీకి బదులు 15న పునః ప్రారంభించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు ఆదివారం విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వేసవి సెలవుల అనంతరం 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, ఈనెల 13న రెండో శనివారం, 14న ఆదివారం కావడంతో వేసవి సెలవులు పొడిగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈనెల 12వ తేదీన సెలవు ఇచ్చినందున.. విద్యా సంవత్సరం నష్టపోకుండా జులై 11న రెండో శనివారం తరగతులు నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ పేర్కొన్నారు.
- Advertisement -



