హాజరుకానున్న 23 పార్టీలు
డిఎంకె, ఆప్ విముఖత
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడి వ్యూహాన్ని చర్చించి, ప్రతిపక్ష ఐక్యతను బలోపేతం చేసేందుకు నేడు(సోమవారం) దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిపక్షాలు భేటీ కానున్నాయి. సోమవారం కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జరిగే ‘ఇండియా జన్ బంధన్’ సమావేశంలో 23 రాజకీయ పార్టీలు పాల్గొననున్నాయి. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, శివసేన (ఠాక్రే) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తదితరులు హాజరయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.ఈ సమావేశం 2029 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇండియా బ్లాక్ భవిష్యత్ కార్యాచరణపై చర్చించనుంది. జాతీయ సమస్యలపై మోడీ ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించనుంది. ప్రతిపక్ష కూటమి తన వైవిధ్యంతోనే ఐక్యంగా నిలుస్తుందని కాంగ్రెస్ పేర్కొంది. అయితే ఈ సమావేశంలో డీఎంకే, ఆప్ పార్టీలు మాత్రం పాల్గొనేందుకు విముఖత వ్యక్తం చేశాయి. కొన్ని పార్టీలు తమ సొంత కారణాల వల్ల ఈ ప్రత్యేక సమావేశానికి హాజరు కాలేమని తెలిపినట్టు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు. ‘
దేశంలో లక్షలాది మంది భారతీయుల ఓటు హక్కును హరించివేస్తున్నారు. ప్రతి రోజు రాజ్యాంగంపై దాడి చేస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయిస్తున్నారు. కోట్లాది మంది ప్రజల జీవనోపాధిని తీవ్రంగా దెబ్బతీస్తున్నారు. ఎడతెరిపి లేకుండా పెరుగుతున్న అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ బహిరంగంగానే ఇండియా బ్లాక్‌కి దూరంగా ఉంది. కేరళలో సీపీఐ(ఎం) బీజేపీతో కుమ్మక్క యిందని కాంగ్రెస్ అగ్ర నేతలు చేసిన ఆరోపణలపై సీపీఐ(ఎం) తీవ్ర విమర్శలు చేసింది.ఈ మేరకు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి లేఖ కూడా రాశారు. ఆ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అటువంటి ఆరోపణలు ప్రతిపక్ష కూటమికి ఆధారమైన సహకార స్ఫూర్తికి విరుద్ధ మని పేర్కొన్నారు. ఆ లేఖను మిగిలిన ఇండియా బ్లాక్ పార్టీల నేతలకు కూడా పంపించారు. అయితే సీపీఐ(ఎం) ‘ఇండియా జన్‌బంధన్’ సమావేశానికి హాజరు కానుంది. సీపీఐ(ఎం) ప్రతినిధిగా ఆ పార్టీ రాజ్యసభ ఉపనేత జాన్ బ్రిట్టాస్ హాజరుకానున్నారు
నేడు ఇండియా జన్‌బంధన్ భేటీ
- Advertisement -
- Advertisement -



