Monday, June 8, 2026
E-PAPER
Homeక్రైమ్పశ్చిమ బెంగాల్‌లో 14 ఏళ్ల బాలికపై సామూహిక లైంగికదాడి..

పశ్చిమ బెంగాల్‌లో 14 ఏళ్ల బాలికపై సామూహిక లైంగికదాడి..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో 14 ఏళ్ల బాలికపై సామూహిక లైంగికదాడి జరిగిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఓ యువతి బాలికను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లి, మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చిన అనంతరం హోటల్‌కు తరలించింది. అక్కడ పలువురు నిందితులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం బాలికను రోడ్డుపై వదిలివెళ్లగా, స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, యువతి, హోటల్ మేనేజర్ సహా నలుగురిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -