Tuesday, June 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాదాపూర్ లో బడి బాట కార్యక్రమం

మాదాపూర్ లో బడి బాట కార్యక్రమం

- Advertisement -

– పాల్గోన్న గ్రామ సర్పంచ్ ఆశా చందర్ పాటిల్
నవతెలంగాణ – జుక్కల్ 

మండలంలోని మాదాపూర్ మండల ప్రజా పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రాజయ్య ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఆశా చందర్ పార్టీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మరియు ఎంపీపీ ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజయ్య మాట్లాడుతూ గ్రామంలో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న పిల్లలను గుర్తించి శ్రీ ప్రైమరీ స్కూల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులకు అవగాహన చేయడం జరిగింది అని అన్నారు. అదేవిధంగా డ్రాప్ అవుట్ అయిన పిల్లలకు మళ్ళీ పాఠశాలకు వచ్చే విధంగా ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత  యూనిఫామ్, మధ్యాహ్నం భోజనంలో పౌష్టికాహారం, ఉచిత పెన్ను , పాఠ్య పుస్తకాలు, నోటుబుక్కులు, ఉదయం పూట రాగి జావా వంటివి కాక అదనంగా పలు సౌకర్యాలను పేద విద్యార్థులకు కల్పించడం జరుగుతుంది అని పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలు బడిబాట- విద్యాబాట , ప్రతి పిల్లవాడు బడికి రావాలి, విద్యా హక్కు – ప్రతి ఒక్కరి హక్కు, ప్రభుత్వ బడి – పిల్లల భవిష్యత్తు మేలని  విద్యార్థుల తల్లిదండ్రులకు  తెలిపారు. ప్రైవేట్ పాఠశాలకు వెళ్లే విద్యార్థిని,  విద్యార్థుల పేరెంట్స్ కు ప్రభుత్వ పాఠశాలలో పంపిస్తున్న సౌకర్యాలు వివరించి ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను పంపే విధంగా అవగాహన చేసి పలువురు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విధంగా పేరెంట్స్ కు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజయ్య, ఉపాధ్యాయుడు సంతోష్ , వార్డు సభ్యుడు లక్ష్మణ్, జిపి కార్యదర్శి రవి రాథోడ్ , అశోక్ , గ్రామ పెద్దలు , తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -