Tuesday, June 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఫోన్ ట్యాపింగ్ విచారణకు హాజరైన మాజీ మేయర్ అజయ్ యాదవ్

ఫోన్ ట్యాపింగ్ విచారణకు హాజరైన మాజీ మేయర్ అజయ్ యాదవ్

- Advertisement -

నవతెలంగాణ-బోడుప్పల్
గత శాసనసభ సాదారణ ఎన్నికలలో బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ ఫోన్ ట్యాప్ అయినట్లు గుర్తించిన సీట్ అధికారులు మంగళవారం విచారణకు రావాలని కోరడంతో హాజరైన మాజీ మేయర్ 2023 అక్టోబర్ లో ఫోన్ నెంబరు ను ట్యాప్ చేసినట్లు చూపించారు. గత ఎన్నికలలో మాజీ మేయర్ తోటకూర అజయ్ తండ్రి తోటకూర వజ్రెష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గా పోటి చేశారు. ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు మాజీ మేయర్ ఫోన్ ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం అజయ్ యాదవ్ మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నిఘా వ్యవస్థలను అడ్డగోలుగా వాడుకుని అక్రమ మార్గంలో ఎన్నికలలో గెలుపొందారని విమర్శించారు. తన తండ్రి విజయం సాగిస్తున్నారనే అక్కసుతో మాజీ మంత్రి మల్లారెడ్డి ఈ కుటిలా యత్నాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఇప్పటికైన సీట్ అధికారులు పోన్ ట్యాప్ కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -