Thursday, February 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలునవతెలంగాణ వార్తకు స్పందన..

నవతెలంగాణ వార్తకు స్పందన..

- Advertisement -

నవతెలంగాణ-బెజ్జంకి
మండలంలో నాలుగురోజులు గడువున్న బాలమృతం పౌష్టికాహారం పంపిణీ చేసిన అంగన్వాడీ కేంద్రం నిర్వహాకుల తీరుపై నవతెలంగాణ దినపత్రిక గురువారం వార్తను ప్రచురించింది. ‘నవతెలంగాణ’ వార్తకు స్పందించి రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ సుమోటగా కేసు నమోదు చేసింది. నాలుగురోజుల్లో గడువు ముగియనున్న బాలమృతం పౌష్టికాహారాన్ని పిల్లలకు పంపిణీ చేయడాన్ని రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ సుమోటగా స్వీకరించి పంపిణీలో అంగన్వాడీ కేంద్రం నిర్వహాకురాలు బాధ్యత రహిత్యం.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుపై జిల్లా డీజీఆర్ఓ, డీడబ్ల్యూఓ అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి నివేదికను 20 రోజుల్లో ఆహార భద్రత కమిషన్ కార్యాలయానికి జిల్లా పరిపాలనాధికారి సమర్పించాలని అధేశాలిచ్చినట్టు రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ సభ్యుడు ఓరుగంటి ఆనంద్ తెలిపారు.
పంపిణీ చేసి.. మరోకటిస్తానని తీసుకువెళ్లీ..
నాలుగు రోజుల్లో గడువు ముగియనున్న బాలమృతం పౌష్టికాహారం పంపిణీ చేసి..పిల్లల ఇంటికెళ్లి మరోకటిస్తానని అంగన్వాడీ కేంద్రం నిర్వహాకురాలు తిరిగి తీసుకువెళ్లినట్టు ఓ గ్రామంలోని కుటుంబ సభ్యులు తెలిపారు.గర్భీణీలకు,బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ చేయడంలో అంగన్వాడీ కేంద్రం నిర్వహాకుల నిర్లక్ష్యంపై అధికారులు శ్రద్ధ చూపాలని పలువురు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -