మనోజ్ కుమార్, మోహన సిద్ధి, శృతి శంకర్ హీరో హీరోయిన్లుగా రమేష్ చెరుకూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ వి. సాంబశివరావు, వేణు గోపాల చారి సారధ్యంలో సావిత్రమ్మ నిర్మించారు. ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన టీజర్, ట్రైలర్ విడుదల వేడుకలో దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, బి. గోపాల్, దామోదర ప్రసాద్, తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య, వి. సముద్ర, రామ్ ప్రసాద్, నటుడు-నిర్మాత అశోక్ కుమార్, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్, రాజేందర్ ప్రసాద్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. హీరో మనోజ్ కుమార్ మాట్లాడుతూ, ‘సొంత ఊరిని వదిలి, దూర ప్రాంతాలకు వెళ్లిన వారి జీవితాలకు ఈ కథ మరింత దగ్గరగా ఉంటుంది. మా ఇద్దరు హీరోయిన్లు ఇద్దరూ ఎంతో బాగా నటించారు. ప్రేక్షకులకు వినోదంతో పాటు భావోద్వేగాలను అందించే సినిమా ఇదిఅని అన్నారు. 'ప్రేక్షకులందరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది అని హీరోయిన్ మోహన సిద్ధి చెప్పారు. మరో హీరోయిన్ శృతి శంకర్ మాట్లాడుతూ, ‘ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడు రమేష్ కి ప్రత్యేక కృతజ్ఞతలు. మంచి కథతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉందిఅని తెలిపారు. దర్శకుడు రమేష్ చెరుకూరు మాట్లాడుతూ, 'ఈ ప్రాజెక్టు ప్రయాణంలో వి.ఎన్. ఆదిత్య సహకారం నాకు ఎంతో ఉపయోగపడింది. ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రేమకథతో పాటు మంచి సందేశాన్ని కూడా ఈ సినిమాలో చూపించబోతున్నాం అని అన్నారు.
సందేశమిచ్చే ప్రేమకథ
- Advertisement -
- Advertisement -



