తండ్రీ కొడుకుల అనుబంధం, త్యాగం, ప్రేమ, భావోద్వేగాల నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘ఐ యామ్ హ్యాండ్సమ్’ (సిన్స్ 2009). దుర్గా దేవ్ నాయుడు హీరోగా నటిస్తూ స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. కె ఫిలిమ్స్ బ్యానర్ పై మహేష్ గుడారు సమర్పణలో కేదార్‌నాథ్ నిర్మించారు. అన్విష కథానాయికగా నటించిన ఈ చిత్రం ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రసాద్ ల్యాబ్స్‌లో చిత్ర ట్రైలర్ లాంచ్, ప్రీ-రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై, చిత్ర బృందాన్ని అభినందించారు. దర్శకుడు, హీరో దుర్గా దేవ్ నాయుడు మాట్లాడుతూ, ‘ప్రేక్షకులందరికీ నచ్చే సినిమా తీశాను. ఒకవేళ నచ్చకపోతే ఇంకా మంచి సినిమా తీస్తానని నిజాయితీగా చెబుతున్నాను. ఈ సినిమాపై నాకు పూర్తి నమ్మకం ఉంది. చిత్ర యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి పనిచేశారు. డబ్బుల గురించి ఆలోచించకుండా సినిమా కోసం కష్టపడ్డారు. నిర్మాత కేదార్ నాథ్, కేఎల్ దామోదర్ ప్రసాద్ ఎంతో సహకారం అందించారు. తెలుగు ప్రేక్షకులతో పాటు మంచి కంటెంట్ కోసం ఎదురుచూసే ప్రతి సినీ ప్రేమికుడికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందిఅని అన్నారు. 'మంచి కథను నమ్మి ఈ సినిమాను నిర్మించాం. తండ్రి-కొడుకుల మధ్య ఉన్న బంధాన్ని హృదయానికి హత్తుకునేలా దర్శకుడు తెరకెక్కించారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురవుతారు అని నిర్మాత కేదార్ నాథ్ చెప్పారు.
ఆద్యంతం భావోద్వేగభరితం
- Advertisement -
- Advertisement -



