Wednesday, June 10, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంహార్ముజ్‌ వద్ద కూలిన అమెరికా అపాచీ హెలికాప్టర్‌

హార్ముజ్‌ వద్ద కూలిన అమెరికా అపాచీ హెలికాప్టర్‌

- Advertisement -

రీపర్ డ్రోన్ తో కూల్చేశాం..ఇరాన్ సాంకేతిక లోపమంటున్న యూఎస్
​టెహ్రాన్: హార్ముజ్‌ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌ ధ్వంసం కాగా… ఇద్దరు పైలట్లు మాత్రం సురక్షితంగా బయటపడినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడించారు. హార్ముజ్‌‌పై ఇరాన్ విధించిన దిగ్బంధనాన్ని ఛేదించే ప్రయత్నాల్లో భాగంగా, యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) అపాచీ హెలికాప్టర్లతో పాటు ఫైటర్ జెట్‌లు, డ్రోన్‌లతో పహారా కాస్తోన్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సమయంలోనే రీపర్ డ్రోన్‌లను కూల్చివేసినట్టు ఇరాన్‌ ప్రకటించగా.. అపాచీ హెలి కాప్టర్‌ ఇరాన్ కాల్పుల్లో కూలిపోయిందా లేదా ఏదైనా సాంకేతికలోపం తలెత్తిందా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. అమెరికా, ఇరాన్‌ల మధ్య ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ యూఎస్‌ సైనిక హెలికాప్టర్‌ కూలిపోవడం ఇదే మొదటిసారి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -