రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్
నవతెలంగాణ-గోవిందరావుపేట
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ పిలుపునిచ్చారు. మంగళవారం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని పీఎస్‌ఆర్ గార్డెన్‌లో సంఘం నాయకులు గుండు రామస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల మద్దతు ధరలు పెంచుతూ నిర్ణయం చేసిందని, మొక్కజొన్నలు గతంలో క్వింటాలుకు రూ.2400 ఉండగా ఈ సంవత్సరం రూ.10 అదనంగా పెంచి రైతాంగంపై కపట ప్రేమను చాటుకుందని విమర్శించారు. ఓ పక్క కాంప్లెక్స్ ఎరువుల సబ్సిడీలు తగ్గించడంతో రైతులపై అదనపు భారం మోపుతూ వ్యాపార సంస్థలకు వత్తాసు పలుకుతున్నారని అన్నారు. మద్దతు ధరలు మాత్రం పెరిగిన ఎరువులు, ప్రెటోల్, డీజిల్ ధరలకు అనుగుణంగా పెంచడం లేదని వాపోయారు.
మద్దతు ధరల కోసం ఆందోళన చేసే రైతులను తొక్కించి చంపిన ఈ ప్రభుత్వాలు.. రైతు పక్షాన రైతు ప్రభుత్వాలనీ చెప్పుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రాష్ట్రంలో గతంలో 12 లక్షల మంది రైతులు సాదా బైనామా దరఖాస్తు పెట్టుకుంటే నేటికీ వారికి రాష్ట్ర ప్రభుత్వం పటాలివ్వలేదని తెలిపారు. ఏజెన్సీలో రైతులు ఎలాంటి హక్కులు లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆరుగాలం పండించిన పంట అమ్ముకుందామంటే పట్టాలు లేవని ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు రైతులకు అమలు కావడం లేదని తెలిపారు. వెంటనే ప్రభుత్వం కాస్తు కాలం ఏర్పాటు చేసి రైతులకు రెవెన్యూ రికార్డు ప్రకారంగా కనీసం మీసేవ పహానీ నకల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా 2025లో వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలన్నారు. లేదంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు తుమ్మల వెంకట్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ఎండీ యాకూబ్, నాయకులు సురేష్, ఊకే నాగేశ్వరరావు, జన్న ఎల్లయ్య, ఖ్యాతం సూర్యనారాయణ, ఐలయ్య సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేకవిధానాలపై పోరాటాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



