Wednesday, June 10, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలువర్ష బీభత్సం

వర్ష బీభత్సం

- Advertisement -

హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత
పాతబస్తీలో విద్యుద్ఘాతంతో ఇద్దరు యువకులు మృతి..లోతట్టు ప్రాంతాలు జలమయం
విద్యుత్‌ ‌సరఫరాలో తీవ్ర అంతరాయం
క్షేత్ర‌స్థాయిలో డీఆర్ ఎఫ్ సేవ‌లు
ట్యాంక్‌బండ్‌పై నిలిచిన వ‌ర‌ద‌ను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనూ భారీ వర్షం

నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం భారీ నుంచి ఓ మోస్తరు వర్షం కురిసినా.. హైదరాబాద్‌ న‌గ‌రంలో వర్ష బీభత్సం సృష్టించింది. మంగళవారం ఉదయం నుంచి వేడి గాలులతో అల్లాడిన జనానికి అమాంతంగా సాయంత్రం మబ్బులు కమ్మేశాయి. ఒక్క సారిగా క్లౌడ్ బరస్ట్ అన్న తీరులో వర్షం దంచి కొట్టింది. చాలా చోట్లు ఈదురుగాలులతో వానపడింది. దీంతో అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. ఫలితంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. భారీ వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ వర్షపు నీటితో నిండిపోయా యి. కాలు తీసి వేయటానికి ప్రయత్నిస్తే.. నడుములోతులో మురుగు నీరు చుట్టేసింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు హైడ్రా బృందాలు రంగంలోకి దిగాయి. భారీ వర్షం, ఈదురుగాలులకు పాతబస్తీ బండ్లగూడలో కరెంట్ తీగలు తెగిపడ్డాయి. ఈ ఘటనలో జాఫర్(25), అబూ(16) అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. ఛత్తా బజార్‌లో రోడ్డుపై కమాన్ కూలింది. ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో ప్రాణ, ఆస్తినష్టం తప్పింది.

ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
నగరంలోని కేపీహెచ్‌బీ, బాచుపల్లి, ప్రగతినగర్, మియాపూర్, చందానగర్, ముషీరాబాద్‌, చంపాపేట్, వర్ష బీభత్సం కర్మన్‌ఘాట్, సరూర్‌నగర్‌, సైదాబాద్‌, కోఠి, సుల్తాన్‌బజార్, అబిడ్స్, బషీర్‌బాగ్‌లో, నారాయణగూడ, హైదర్‌గూడ, లక్డీకపూల్, ట్యాంక్‌బండ్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. మాదాపూర్, కొండాపూర్‌, రాయదుర్గం, రాజేంద్రనగర్, హైదర్‌గూడ, లంగర్‌హౌస్‌, కార్వాన్, మెహదీపట్నం, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, చిక్కడపల్లిలో వాన పడింది. బాగ్‌లింగంపల్లి, గాంధీనగర్, బోలక్‌పూర్‌, కవాడిగూడ, రామ్‌నగర్ ప్రాంతాల్లో వర్షం కురిసింది.

ఈదురుగాలులకు నేలకొరిగిన చెట్లు
సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, గచ్చిబౌలి, లింగంపల్లి, హైటెక్‌సిటీలో భారీ వర్షం కురిసింది. హిమాయత్‌‌నగర్‌, బేగంపేట‌, ఖైర‌తాబాద్, సికింద్రాబాద్‌, నల్లకుంట, బర్కత్‌‌పురాతోపాటు వివిధ ప్రాంతాల్లో ఈదురు గాలులతోపాటు కురిసిన వర్షం వల్ల రోడ్లన్నీ వరదతో నిండిపోయాయి. మ్యాన్‌‌హోల్స్‌ ‌వద్ద చెత్తచెదారంతో మూసుకుపోవడంతో వరద పెద్దఎత్తున నిలిచింది. పెద్ద పెద్ద చెట్లు కూలిపోయాయి. బొల్లారం, ప్యాట్నీ, ప్యారడైజ్, మారేడుపల్లి, చిలకలగూడ, జేబీఎస్, బేగంపేట్ ప్రాంతాలలో భారీ వర్షం పడింది. ఈ భారీ వర్షాల కారణంగా హైదర్‌గూడలో ఓ భారీ వృక్షం నెలకొరిగి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. రామ్‌నగర్ వీఎస్టీ రోడ్డులో మరో చెట్టు నేలకొరిగింది. ముషీరాబాద్‌లో ఈదురుగాలులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.

ట్రాఫిక్కు అంతరాయం
భారీ వర్షం కారణంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. భారీ వర్షం నేపథ్యంలో మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, మియాపూర్ ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం రహదారులపై వరద నీరు నిలిచిపోయింది. వరద నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.

రోడ్లపై వరద ప్రవాహం
మాదాపూర్ పర్వత్‌నగర్ చౌరస్తా వద్ద వరద వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ జామ్ ఏర్పడింది. ఇదే తరహాలో గచ్చిబౌలి, మాదాపూర్‌లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నాంపల్లి పరిసర ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు ప్రవహించింది. దీంతో ఆప్రాంతంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మియాపూర్ జేపీనగర్‌లో రోడ్డుపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. హిమాయత్‌నగర్‌లోని ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో వృక్షం నేలకొరిగింది. బాగ్‌లింగంపల్లి సాయిబాబా ఆలయం వద్ద చెట్టు విరిగిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. రాజేంద్రనగర్‌లోని పాత కర్నూలు రహదారిపై వరద నీరు నిలిచింది.

అత్యధికంగా 8.7 సెం.మీ. వర్షపాతం
హైదరాబాద్లోని బన్సీలాల్‌పేటలో అత్యధికంగా 8.7 సెం.మీ, విఠల్‌వాడిలో 7.8 సెం.మీ, హిమాయత్‌నగర్‌లో 7.8 సెంటీమీటర్లు, విద్యానగర్‌లో 7.3 సెంటీమీటర్లు వర్షపాతం నమోదయింది. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద 7.8 సెం.మీ, బహుదూర్‌పురలో 5.7 సెం.మీ, మారేడపల్లి 5.7 సెం.మీ, నాంపల్లిలో 5.5 సెం.మీ, ఆసిఫ్‌నగర్‌లో 5.5 సెం.మీ వర్షపాతం రికార్డు అయింది. శేరిలింగంపల్లిలో 5.3, కూకట్‌పల్లిలో 5.2 సెం.మీ, అంబర్‌పేటలో 4.7 సెం.మీ. వర్షపాతం నమోదయింది.

హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటన
హైదరాబాద్‌ వరద ప్రభావిత ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. ట్యాంక్‌బండ్‌పై వరద నీటి మళ్లింపు, కూలిన చెట్ల తొలగింపును పర్యవేక్షించారు. భారీ గాలులకు హైదరాబాద్‌లో 76 ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. కొండాపూర్, గచ్చిబౌలి, షేక్‌పేట, మాదాపూర్‌లో చెట్లు నేలకొరిగాయి. హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు రహదారులపై నిలిచిన నీటిని నాలాల్లోకి మళ్లిస్తున్నాయి. వీటికోసం ప్రత్యేకంగా భారీ మోటార్లను వినియోగిస్తున్నాయి. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు హైడ్రా సిబ్బంది కృషి చేస్తోంది.
శేరిలింగంప‌ల్లి, కొండాపూర్‌, గ‌చ్చిబౌలి, షేక్‌పేట‌, టోలిచౌకి, మాదాపూర్ ప్రాంతాల‌తోపాటు సికింద్రాబాద్‌, హైద‌ర్‌గూడ ప్రాంతాల్లో హైడ్రా డీఆర్ ఎఫ్ సిబ్బంది క్షేత్ర‌స్థాయిలో సేవ‌లందించారు. దాదాపు 76 చోట్ల చెట్లు ప‌డిపోవ‌డంతో వాటిని తొల‌గించారు. ముషీరాబాద్‌లో ఈదురుగాలుల ధాటికి విద్యుత్ స‌ర‌ఫ‌రాలో అంతరాయం ఏర్పడింది. రామ్ న‌గ‌ర్‌లోని వీఎస్టీ రోడ్డులో భారీ వృక్షం నేల‌కొరిగింది. మ‌రోవైపు హైద‌ర్‌గూడ‌లోనూ వృక్షం కూలింది.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో..
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శేరిలింగంపల్లి, మియాపూర్, హైటెక్ సిటీ, గండిపేట, నార్సింగ్, వికారాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. నార్సింగి ఓఆర్ఆర్, పోలీస్ అకాడమీ, హైటెక్ సిటీ ప్రాంతాల్లో వర్షం నీరు రోడ్డుపైకి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల విద్యుత్ అధికారులు కరెంటు నిలిపివేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -