Wednesday, June 10, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంనిన్న గోల్డ్ కార్డు..ఇపుడు ప్రీమియం సర్వీస్

నిన్న గోల్డ్ కార్డు..ఇపుడు ప్రీమియం సర్వీస్

- Advertisement -

750 డాలర్లు చెల్లిస్తే..10 రోజుల్లోనే అమెరికా వీసా ఇంటర్వ్యూ
వాషింగ్టన్: అమెరికా వీసా పేరిట వ్యాపారం చేస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యూఎస్ ఖజానా నింపుకోవటానికి ఇటీవల గోల్డ్ కార్డు ప్రవేశపెట్టిన ట్రంప్ సర్కార్..ఇపుడు ప్రీమియం సర్వీస్ పేరుతో నయా దోపిడీకి తెరలేపిం ది. తాజాగా ఆదేశాల ప్రకారం.. ట్రంప్ సర్కార్ ఇంటర్వ్యూల కోసం సుదీర్ఘ నిరీక్షణలకు చెక్‌ పెట్టేలా ట్రంప్‌ యంత్రాంగం కొత్త విధానాన్ని తీసుకురాబో తోంది. ‘ప్రీమియం సర్వీసు’ పేరిట ప్రత్యేక పైలట్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనుంది. దీని కింద 750 డాలర్లను చెల్లించిన వారికి వీసా ఇంటర్వ్యూను వేగంగా ఏర్పాటుచేయనున్నారు. బిజినెస్‌, టూరిస్ట్‌ వీసాలకు ఈ ఆప్షన్‌ను అందించనున్నారు. ఈ మేరకు తాజాగా యూఎస్ విదేశాంగశాఖ తమ ఫెడరల్‌ రిజిస్టర్‌లో నోటీసును ప్రచురించింది. ప్రస్తుతం బిజినెస్‌, టూరిస్ట్‌ వీసాలకు దరఖాస్తుదారులు ప్రాసెసింగ్‌ ఫీజు రూపంలో 185 డాలర్లను చెల్లిస్తున్నారు. దీనికి అదనంగా 750 డాలర్లు చెల్లిస్తే.. ఎంపిక చేసిన అమెరికా దౌత్య, రాయబార కార్యాలయాల్లో దరఖాస్తుదారులు పేమెంట్‌ చేసిన 10 రోజుల్లోపే ఇంటర్వ్యూ ను షెడ్యూల్‌ చేసుకునే వీలు లభించనుంది. ఈ పైలట్ ప్రోగ్రామ్‌ను జులై 1 నుంచి డిసెంబరు 31 వరకు అందుబాటులో ఉంచనున్నట్టు సదరు నోటీసుల్లో పేర్కొన్నారు.

ప్రస్తుతానికి ఈ పైలట్‌ ప్రోగ్రామ్‌ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే, ఏయే ఎంబసీ, కాన్సులేట్లలో ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొస్తారనే వివరాలను జులై 1 కంటే ముందే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆరు నెలల కాలానికి ఈ ప్రీమియం సర్వీసులను రూపొందించినా.. పరిస్థితులను బట్టి మరింత కాలం పొడిగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా వీసా విధానాలను అత్యంత కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. వలసదారుల రాకను అరికట్టేందుకు భారీ వీసా ప్రాసెసింగ్‌ ఫీజులు, బాండ్లు, సోషల్‌ మీడియా వెట్టింగ్‌ వంటి నిబంధనల ను అమలు చేస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసా ప్రాసెసింగ్‌ ప్రక్రియ ఆలస్యమవుతోం ది. కొన్ని దేశాల్లో వీసా ఇంటర్వ్యూల కోసం దరఖాస్తుదారులు నెలలతరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే దరఖాస్తుదారులకు కొంత ఊరట కల్పించేలా తాజాగా ‘ప్రీమియం సర్వీసు’లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అయితే, ఈ ప్రత్యేక ఆఫర్‌ కోసం అదనపు రుసుము లు చెల్లించినా.. వీసా వస్తుందన్న గ్యారెంటీ ఉండ దు. ఇది కేవలం వేగంగా ఇంటర్వ్యూను షెడ్యూల్‌ చేసుకునేందుకు మాత్రమే వీలు కల్పిస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -