ఒమన్‌పై 105 పరుగులతో గెలుపు
పల్లెకల్ (శ్రీలంక) : ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో సహా ఆతిథ్య దేశం శ్రీలంక గ్రూప్ దశలో వరుసగా రెండో విజయం సాధించింది. గురువారం పల్లెకల్‌లో జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో ఒమన్‌పై 105 పరుగులతో శ్రీలంక ఘన విజయం సాధించింది. కుశాల్ మెండిస్ (61, 45 బంతుల్లో 7 ఫోర్లు), పవన్ రత్ననాయకె (60, 28 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్), దసున్ శకన (50, 20 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో ధనాధన్ షో చేశారు.
టాప్-5 బ్యాటర్లలో ముగ్గురు అర్థ సెంచరీలు బాదటంతో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 225 పరుగులు చేసింది. భారీ ఛేదనలో మహ్మద్ నదీమ్ (53 నాటౌట్, 56 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్థ సెంచరీ సాధించినా.. ఒమన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 120 పరుగులే చేసింది. శ్రీలంక బౌలర్లలో దుష్మంత చమీర (2/19), మహీశ్ తీక్షణ (2/11) రాణించారు. వరుస విజయాలతో గ్రూప్-బిలో అగ్రస్థానంలో నిలిచిన శ్రీలంక.. తర్వాతి మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, జింబాబ్వేతో తలపడనుంది. గ్రూప్ దశలో ఒమన్‌కు ఇది వరుసగా రెండో పరాజయం. పవన్ రత్ననాయకె ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.



