డ్రగ్స్ వల్లే పంజాబ్ వెనుకబడటాన్ని గమనించాలి
రాష్ట్రంలో మావోయిస్టు సమస్య లేదు
వేరే విభాగాల్లోకి గ్రేహౌండ్స్ సిబ్బంది : డీజీపీ సీవీ ఆనంద్
ఆదిలాబాద్‌లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న డీజీపీ
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాల ని, డ్రగ్స్ వల్ల పంజాబ్ వెనుకబడిపోయిన విషయా న్ని గమనించాలని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. ప్రజల శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా తెలంగాణ పోలీస్ పని చేస్తోందని తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే పోలీస్‌స్టేషనకు వచ్చే ఫిర్యాదు దారుల పట్ల, ప్రజల పట్ల పోలీసులు ఫ్రెండ్లీగా ఉంటారు కానీ రౌడీలకు, గూండాలకు కాదని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడారు. గతంతో చూస్తే రోడ్డు ప్రమాదాలు దాదాపు 50 శాతం తగ్గాయన్నారు. హైవేల పక్కన అక్రమ పార్కింగ్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నా యన్నారు. రాష్ట్రంలో గతేడాదిలో రోడ్డు ప్రమాదాల్లో 7800 మంది చనిపోతే, దేశంలో లక్షా 72 వేల మంది చనిపోయా రని తెలిపారు. పెద్ద యుద్ధాల్లో కూడా ఇంత మంది చనిపోరని ఆందోళన వ్యక్తం చేశారు. కారు డ్రైవర్లు సీట్ బెల్ట్, టూవీలర్స్ రైడర్స్ హెల్మెట్ ధరించాలని సూచించారు. అలసిపోయిన సమయంలో డ్రైవింగ్ చేయొద్దన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిం చారు. గంజాయి సాగు రవాణా చేయొద్దని, అలా చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాష్ట్రంలో మావోయిస్టు సమస్య లేదు
దేశంలోని 7, 8 రాష్ట్రాల్లో మావోయిస్టులు లొంగిపోయారని, అందులో తెలంగాణ, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చాలామంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. తెలంగాణలో ఇంకా ఒకరిద్దరు మాత్రమే ఉన్నారని, వారినీ లొంగిపోవాలని చెబుతున్నామని అన్నారు. భూపాలపల్లి, ఏటూరునాగారం, భద్రా చలంలో లొంగిపోయిన మావోయిస్టులు ఉన్నారని, వారికి భూమితోపాటు ఇతర అవసరాలు తీరుస్తా మని తెలిపారు. గ్రేహౌండ్స్‌లో 500 మంది సిబ్బంది ని వేరే విభాగాలకు వాడుకుంటున్నామని తెలిపారు. ఎస్ఐబీ, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాల్లో సిబ్బందిని తగ్గిస్తామని తెలిపారు. వారిని డ్రగ్స్, సైబర్, ఫుడ్ సేఫ్టీ, విజిలెన్స్ అండ్ ఎన్పోర్స్మెంట్ విభాగాలకు మార్చుతామన్నారు.}
డ్రగ్స్ కంట్రోల్ చేయాలి
రాష్ట్రంలో డ్రగ్స్ సమస్య ఎక్కువగా ఉందని డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. దాన్ని కంట్రోల్ చేయాలని, అందుకు ప్రజల భాగస్వామ్యం కావా లని కోరారు. డ్రగ్స్‌పై పోరాటం చేయకపోతే భవిష్యత్ అంధకారంగా మారుతుందన్నారు. ఆదిలా బాద్ జిల్లాకు 30 ఏండ్ల తర్వాత రావడం సంతో షంగా ఉందని, ఉమ్మడి జిల్లాలో అడిషనల్ ఎస్పీగా పని చేశానని డీజీపీ గుర్తుచేశారు. డీజీపీ పర్యటనలో భాగంగా ఏఆర్ హెడ్ క్వార్టర్స్ సమావేశం మందిరం లో జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టి ట్యూట్‌ను ప్రారంభించారు. ఏఆర్ హెడ్‌క్వార్టర్స్ మోటార్ ట్రాన్స్పోర్ట్ విభాగం వద్ద ఏర్పాటు చేసిన కార్ హైడ్రాలిక్స్ వ్యవస్థను ప్రారంభించారు. కుమురం భీం చౌరస్తా వద్ద ట్రాఫిక్ సిగల్స్‌ను ప్రారంభించారు. సమావేశంలో మల్టీజోన్ – 1 ఐజీ ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్పీ అఖిల్ మహాజన్, అడిషనల్ ఎస్పీ మౌనిక, ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి పాల్గొన్నారు.



