- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దు గ్రామం మథురా తాండాలో గురువారం గ్రామ సర్పంచ్ అనిత మోహన్ అధ్యక్షతన 99 ఈ రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీఓ రాము హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ అనిత మోహన్ మాట్లాడుతూ.. గ్రామంలో మొదటగా పరిశుభ్రత ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. శానిటేషన్, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యుత్తు, సాగు, త్రాగు నీరు, ఆరోగ్యంపై గ్రామస్తులు అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎంపీఓ, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, కార్యదర్శి, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



