Friday, June 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సాంబయ్య మృతి ఆర్ఎంపీ సంఘానికి తీరని లోటు

సాంబయ్య మృతి ఆర్ఎంపీ సంఘానికి తీరని లోటు

- Advertisement -

ఆర్ఎంపీ, పిఎంపీ వెల్పేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కత్తి సంపత్ గౌడ్
నవతెలంగాణ – మల్హర్ రావు

సీనియర్ గ్రామీణ వైద్య మిత్రుడు ఎరుకొండ సాంబయ్య అకాల మరణం ఆర్ఎంపీ సంఘానికి తీరని లోటని ఆర్ఎంపి, పిఎంపీ వెల్పేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కత్తి సంపత్ గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా ప్రధాన కార్యదర్శి బాలరాజు ఆధ్వర్యంలో సాంబయ్య స్వగ్రామం జంగెడులో జిల్లా కార్యవర్గం మృతుని కుటుంబాన్ని పరమర్శించి, ఓదార్చారు .అధైర్య పడొద్దు అన్నివిధాలా సంఘం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. అనంతరం మృతుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సాంబయ్య ఆర్ఎంపీ సంఘానికి, నిరుపేద ప్రజలకు అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మిడిదొడ్ల రాజు, ఉపాధ్యక్షుడు చింతల కుమార్ యాదవ్, గౌరవ అధ్యక్షుడు చారి, రాష్ట్ర నాయకులు వెంకట నారాయణ, వంగ కుమారస్వామి, జిల్లా అర్బన్ నాయకులు రమేష్, అశోక్ రెడ్డి, శ్రీనివాస్, మోహన్ రెడ్డి, భద్రయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -