నవతెలంగాణ-ఆర్మూర్
మండలంలోని అంకాపూర్ స్వగ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ కోకిల నాగరాజు దర్శకత్వంలో రూపొందించిన బడిబాట వినూత్న ప్రచార వీడియోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జిల్లా విద్యాశాఖ,సమగ్ర శిక్షా నిజామాబాద్ సౌజన్యంతో నిర్మించిన బడిబాట వీడియోలు విద్యార్థులను, తల్లిదండ్రులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడం కోసం, ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాల గురించి, ప్రైవేటు కు పంపడం వలన కలుగుతున్న ఆర్థిక నష్టాల గురించి అందరికీ అర్థం అయ్యేలా ప్రభుత్వ ఉపాధ్యాయులు. విద్యార్థులే స్వయంగా నటించి బడిబాట వీడియోలు రూపొందించారు. వీటికి ముందుమాట అడిషనల్ కలెక్టర్ భుజంగరావు , జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ చెప్పారు. గల్ఫ్ లో ఉంటున్న తండ్రి, ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఎవరు ఏం అనుకుంటారో అని కొడుకును ప్రైవేట్ కు పంపడం ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడటం కళ్లకు కట్టినట్టు చూపారు.
ఇందులో ప్రభుత్వ ఉపాధ్యాయులు సుజాత రామగిరి, ప్రకాష్ , కళాకారుడు చిట్టి బాబు, కోమన్ పల్లి విద్యార్థి శ్రీశాంత్ నటించారు. మరో వీడియోలో ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన అల్పాహార పథకం గురించి తెలియజేస్తూ , ఏమేమి సౌకర్యాలు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందుతున్నాయో చక్కగా వివరించారు. పల్లెటూర్లో హోటల్ ల దగ్గర జరిగే మామూలు ముచ్చట్లు గా తీసిన ఈ వీడియో అందరినీ ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేసేల ఉంది. ఇందులో ప్రముఖ కవి రచయిత డా.కాసర్ల నరేష్ రావు, కవి , చిత్రకారుడు చింతల శ్రీనివాస్, కొనసముందర్ తెలుగు ఉపాధ్యాయుడు , గాయకుడు రాజా శేఖర్ , కోమన్ పల్లి విద్యార్థిని శివాని , కొనసముందర్ విద్యార్థిని స్ఫూర్తి అద్భుతంగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ప్రీ ప్రైమరీ బడుల ప్రారంభం , అల్పాహార పథకం ప్రారంభం, పాలు ,రాగి జావా అందించడం ,ప్రభుత్వ సౌకర్యాల గురించి జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ప్రత్యేకంగా కొన్ని వీడియోలు స్వయంగా ఆయనే మాట్లాడుతూ స్లైడ్స్ రూపంలో చూపించడం ,మాట్లాడటం చేయడంతో ఉపాధ్యాయుల్లో సైతం కొత్త ఉత్సాహం కనిపిస్తుందని ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేశారు.
బడిబాట వీడియోలు రూపొందించడం గురించి పోటీకి సైతం పంపమనడంతో అనేక పాఠశాలలు వీడియోలు రూపొందించి పంపారు. ప్రముఖ కళాకారుడు. బహుముఖ ప్రజ్ఞాశాలి డా.కోకిల నాగరాజు దర్శకత్వంలో రూపొందించిన ఈ వీడియోలు విశేషంగా ఆకట్టుకోవడంతో మిగతా ఉపాధ్యాయులు సైతం తమ పాఠశాలల కోసం ఏ ఐ సహాయంతో వీడియోలు తీస్తూ బడిబాట ప్రచారం చేస్తున్నారు. విద్యాశాఖ చేస్తున్న ఈ ప్రయత్నాల వలన ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని , తల్లిదండ్రుల ఆలోచన విధానంలో చాలా మార్పు వస్తుందని జిల్లా విద్యాశాఖ, ఉపాధ్యాయులు ఆశిస్తున్నారు.
వినూత్నంగా బడిబాట ప్రచారం – ఆకట్టుకుంటున్న వీడియోలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



