Sunday, June 14, 2026
E-PAPER
Homeఆటలువరుణుడు అడ్డొచ్చినా..!

వరుణుడు అడ్డొచ్చినా..!

- Advertisement -

తొలి వన్డేలో అఫ్గాన్‌‌పై భారత్‌ గెలుపు
ఛేదనలో శుభ్‌‌మన్‌ గిల్‌ అజేయ అర్థ సెంచరీ
అఫ్గనిస్తాన్‌ 194/10, భారత్‌ 195/3


నవతెలంగాణ-ధర్మశాల :
అఫ్గనిస్తాన్‌‌తో వన్డే సిరీస్‌‌లో ఆతిథ్య భారత్‌ ‌బోణీ కొట్టింది. శనివారం ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌‌కు వరుణుడు తీవ్ర అంతరాయం కలిగించినా.. టీమ్‌ ఇండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ నెగ్గి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌.. వర్షం ఆగే వరకు ఆగాల్సి వచ్చింది. ఎడతెగని వర్షంతో 50 ఓవర్లను అంపైర్లు 25 ఓవర్లకు కుదించారు. ఓపెనర్‌ ‌రెహ్మనుల్లా గుర్బాజ్‌ (102, 51 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌‌లు) మెరుపు సెంచరీతో చెలరేగాడు. అజ్మతుల్లా (26), హష్మతుల్లా (27) రాణించారు. భారత బౌలర్లలో అరంగేట్ర పేసర్‌, ‌గుర్నూర్‌ ‌బరార్‌ (3/27), అరంగేట్ర స్పిన్నర్‌ ‌హర్ష్‌ ‌దూబె (3/47) సహా అర్ష్‌దీప్‌ ‌సింగ్‌ (2/27), నితీశ్‌ ‌కుమార్‌ రెడ్డి (2/31) రాణించగా అఫ్గాన్‌ 24.5 ఓవర్లలో 194 పరుగులకు కుప్పకూలింది. ఛేదనలో కెప్టెన్‌ ‌శుభ్‌‌మన్‌ ‌గిల్‌ (84 ‌నాటౌట్‌, 66 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌‌లు) అజేయ అర్థ సెంచరీతో రాణించాడు. కెఎల్‌ ‌రాహుల్‌ (39 ‌నాటౌట్‌, 19 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌‌లు), ఇషాన్‌ ‌కిషన్‌ (34, 22 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఆకట్టుకున్నారు. రోహిత్‌ ‌శర్మ (16), శ్రేయస్‌ అయ్యర్‌ (12) నిరాశపరిచారు. 22.5 ఓవర్లలోనే 195 పరుగులు చేసిన భారత్‌.. మరో 13 బంతులు ఉండగానే లాంఛనం ముగించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -