బంద్‌లు
బలిదానాలు
రాస్తారోకోలు
రక్త పాతాలు
మిలియన్ మార్చ్ లు
మేధావుల చర్చలు
అగ్గిమీద గుగ్గిళంలా లేచిన ఉద్యమాలు
నిప్పంటిచుకున్న దేహాలు
గొంతు తడవని దాహాలు
యెడతెరిపి లేని కురిసిన
జడివానలో
తెగిపడిన ఆనకట్టలా
ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమంలో
బీటలు వారిన సమైక్యవాద అడ్డుగోడలు
కోట్ల గొంతుల్లోంచి ఒకే మాట
జై తెలంగాణ అంటూ పాడిన పాట
ఒకే నినాదంతో పేలిన మాటల తూట
గజ గజా వణికిన ఢిల్లీ కోట
ఆత్మాభిమానంతో
ఆత్మబలి దానాలతో
అమరుల త్యాగాలతో
ఆమరణ నిరాహార దీక్షలతో
అరవై యేళ్ళ వద్ధుడు సైతం
పిడికెల్లెత్తి నడుం బిగించి
కదం తొక్కిన తరుణం
దశాబ్దాల పురిటి నొప్పులననుభవించి
పురుడు పోసుకున్న తెలంగాణలో
రైతుల ఆత్మహత్యలూ
నిరుద్యోగుల ఆకలి దప్పులూ
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో
సరిహద్దులే మారారు
సమస్యలు అలాగే మిగిలారు
– కోనేటి నరేష్, 8499847863
సమస్యల తెలంగాణం
- Advertisement -
- Advertisement -



