Sunday, June 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణకు భారీ వర్ష సూచన..

తెలంగాణకు భారీ వర్ష సూచన..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో నైరుతి రుతుపవనాల రాకతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రుతుపవనాలు శనివారం నాటికి హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం మీదుగా సోలాపూర్, కళింగపట్నం వరకు విస్తరించాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే రెండు రోజుల్లో ఇవి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో నేడు, రేపు (ఆది, సోమవారాల్లో) గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మంగళ, బుధవారాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -