Sunday, June 14, 2026
E-PAPER
Homeమానవిరక్తదానం చేద్దాం..!

రక్తదానం చేద్దాం..!

- Advertisement -

రక్తదానం ఆరోగ్యానికి మంచిది. అత్యవసర పరిస్థితుల్లో రక్త దానం చేస్తే మనం ఒక వ్యక్తి యొక్క ప్రాణాన్ని కాపాడవచ్చు. రోడ్డు ప్రమాదాలుజరిగినప్పుడు, ఆపరేషన్ చేసే సమయంలో సాధారణంగా రక్తం అవసరం ఉంటుంది. రక్త దానం గురించి ప్రజలలో అవగాహన పెంచేందుకు ప్రతి ఏడాది జూన్ 14న ప్రపంచ రక్తదాన దినోత్సవం జరుపుతారు. వరల్డ్ బ్లడ్ డోనర్ డేను జూన్ 14వ తేదీనే జరుపుకోవడానికి మరొక కారణం ఉంది. ఆరోజు ప్రముఖ జీవ శాస్త్రవేత్త కార్ల్ లాండ్‌స్టీనర్ జన్మించారు. ఈ యన ఆస్ట్రియాలో జన్మించి అమెరికాలోస్థిరపడ్డాడు.ఈయన జయంతిని ప్రపంచ రక్తదాన దినోత్సవంగా జరపాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ భావించింది. ప్రస్తుతం మన రక్తం ఫలానా గ్రూప్ అంటే ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఓ పాజిటివ్ అని ఎలా అయితే గుర్తిస్తున్నామో వీటిని గ్రూపులుగా విభజించింది కార్ల్ లాండ్‌స్టీనర్.

1900వ సంవత్సరంలో కార్ల్ లాండ్‌స్టీనర్ రక్తంకు వివిధ గ్రూపులను ఇచ్చారు. తద్వారా ఏ మనిషికి ఏ గ్రూపు రక్తం కావాలో దానికి అనుగుణంగా ఆ గ్రూప్ రక్తం ఇవ్వడం జరుగుతుంది. 1930లో లాండ్ స్టీనర్ పరిశోధనకు గాను నోబెల్ పురస్కారం వరించింది. జూన్ 14వ తేదీన అంతర్జాతీయ రెడ్ క్రాస్, రెడ్ క్రెసెంట్ సొసైటీలు రక్తం ప్రాముఖ్యత గురించి పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం 2026 (జూన్ 14) యొక్క అధికారిక థీమ్ “మానవత్వం యొక్క ఒక చుక్క. రక్తం ఇవ్వండి. ప్రాణాలను కాపాడండి.ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రజలు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని తద్వారా ప్రాణాలను కాపాడాలని ఈ నినాదం ఉద్దేశం. రక్తదానం చేసే వారిని ప్రోత్సహించడం, చేసిన వారికి కృతజ్ఞతలుతెలపడం,అవసరమైన వారికి ఉచితంగా రక్తం అందించడం వంటి లక్ష్యాలతో ఈదినోత్సవంనిజరుపుతున్నారు.మనదేశంలో కూడా ప్రతి సంవత్సరం ఆక్టోబర్ 1 న జాతీయ స్వచ్చంద రక్తదాన దినోత్సవంజరుపుతారు. రక్తదానం,అవయవ దానం పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది.
– యమ్. రామ్ ప్రదీప్,
జెవివి సభ్యులు, తిరువూరు
9492712836

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -