Saturday, August 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లేగ దూడపై ఊర కుక్కల దాడి

లేగ దూడపై ఊర కుక్కల దాడి

- Advertisement -

నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండల కేంద్రానికి చెందిన రైతు ఎండి నజీర్ పాషా వ్యవసాయ పొలంలోని పశువుల దొడ్డిపై ఆదివారం ఉదయం ఊర కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో లేగా దూడపై కుక్కలు తీవ్రంగా దాడి చేయడంతో అది గాయపడింది. గమనించిన రైతు వెంటనే దూడను రక్షించి ఉప్పునుంతల పశు వైద్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యాధికారులు దూడకు చికిత్స అందించారు. గ్రామాల్లో పెరుగుతున్న ఊర కుక్కల బెడదపై అధికారులు దృష్టి సారించి తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -