Sunday, June 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చేగువేరా స్ఫూర్తి తో జెన్ జీ యువత ఉద్యమాలను నిర్మించాలి 

చేగువేరా స్ఫూర్తి తో జెన్ జీ యువత ఉద్యమాలను నిర్మించాలి 

- Advertisement -

ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో చే 98వ జయంతి 
నవతెలంగాణ-కంఠేశ్వర్ 

భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ ఎఫ్ ఐ) జిల్లా కార్యాలయంలో చేగువేరా 98వ జయంతి ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ.. చేగువేరా కు పూల దండ వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విగ్నేష్ మాట్లాడుతూ.. చేగువేరా పోరాట స్ఫూర్తితో విద్యారంగ సమస్యల పై పోరాటాలను నిర్వహించాలని అన్నారు.

అదేవిధంగా చేగువేరా చిన్ననాటి నుండి ఆస్తమాతో బాధపడుతూ లాటిన్ అమెరికా దేశాలను కలయతిరిగి స్వతంత్రాన్ని అందించిన మహా నేత చేగువేరా అని కొనియాడారు. అదేవిధంగా చేగువేరా ఎంతో మంది యువతకు ఆదర్శమని ఆయన అడుగుజాడల్లో నడిచి ఈ దేశంలో పెరుగుతున్న నిరుద్యోగానికి వ్యతిరేకంగా జెన్ – జీ లు ఉద్యోగాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలు నిర్వహించాలి అని అన్నారు. అప్పుడే చేగువేరా ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన వాళ్ళం అవుతాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి చక్రీ, యూనివర్సిటీ అధ్యక్షులు వినీత్, జిల్లా నాయకులు రాజు, సుజిత్, సుశాంత్, రాహుల్, ప్రసాద్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -