Sunday, June 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మంత్రి తుమ్మలను కలిసిన ఎమ్మెల్యే

మంత్రి తుమ్మలను కలిసిన ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – మిరుదొడ్డి
దుబ్బాక నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ మౌలిక వసతులను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దుబ్బాక నియోజకవర్గ పరిధిలో ఉన్న 5 వ్యవసాయ మార్కెట్ కమిటీల (AMC)లో ప్రతి మార్కెట్‌కు 40,000 మెట్రిక్ టన్నుల అదనపు నిల్వ సామర్థ్యం కల్పిస్తూ మొత్తం 2 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు నిల్వ సామర్థ్యం కలిగిన ఆధునిక గోదాములు మంజూరు చేయాలని కోరారు. రైతులకు యూరియా, దుక్కి మందు, పురుగుమందులు, వివిధ రకాల నాణ్యమైన విత్తనాలు సకాలంలో, అందుబాటు ధరల్లో లభించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పంటల నిల్వ, మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపడితే రైతులకు గణనీయమైన ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంటూ, ఈ అంశాలపై మంత్రి కి వినతిపత్రం అందజేశారు. రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే లక్ష్యంగా దుబ్బాక రైతుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -