Sunday, June 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన తహశీల్దార్

వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన తహశీల్దార్

- Advertisement -

నవతెలంగాణ–కొండాపూర్
ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో కొండాపూర్ తహశీల్దార్ అశోక్ క్షేత్రస్థాయిలో పర్యటించి వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. వర్షాల కారణంగా నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, కూలిపోయిన ఇళ్లు, రోడ్లపై పడిపోయిన చెట్లను నేరుగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ అశోక్ మాట్లాడుతూ.. వర్షాల వల్ల ఏర్పడిన సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. నేలకొరిగిన విద్యుత్ స్తంభాల పునరుద్ధరణ, రోడ్లపై పడిన చెట్ల తొలగింపు, దెబ్బతిన్న ఇళ్ల వివరాల సేకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. భారీ వర్షాల ప్రభావంతో మండలంలో అధిక సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని పేర్కొన్నారు. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చే విషయమని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు. వర్షాల కారణంగా నష్టపోయిన వారికి ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ అశోక్ వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -