మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి..
నవతెలంగాణ-కుభీర్
ముధోల్ నియోజకవర్గం లో అన్ని మండలాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిధులు మంజూరు చేసి గ్రామాలను అభివృద్ధి పరిచేందుకు ఎంతో పూజ చేయడం జరుగుతుందని ముధోల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి అన్నారు. ఆదివారం తన నివాసంలో కుభీర్ మండలంలోని ఆయా గ్రామాలలో సిసి రోడ్లు మురికి కాలువలు నిర్మించేందుకు 60 లక్షల నిధులకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను ఆయా గ్రామాల సర్పంచులకు మరియు మండల నాయకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ఆయా గ్రామంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ గృహాలు, మహిళలకు ఉచిత బస్సు , ఉచిత విద్యుత్తు, తదితర పథకాలను ప్రజలకు అందించడం జరుగుతుందన్నారు.
అదేవిధంగా రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర కల్పించడం జరుగుతుందన్నారు. దీంతోపాటు మండలంలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభించేందుకు కృషి చేస్తామని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కళ్యాణ్ , కుబీర్ సర్పంచ్ సాయినాథ్ సౌంలీ సర్పంచ్ సాయినాథ్ మొల సర్పంచ్ శ్రీధర్,సోనారి సర్పంచ్ నరసింహ మాజీ సర్పంచ్ విజయ్ కుమార్ ఏం సి డైరెక్టర్ అరుణ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బెల్లల గంగయ్య,మిలింద్ సాయి యోగేష్ తదితరులు ఉన్నారు.



