Sunday, June 14, 2026
E-PAPER
Homeజిల్లాలుచినుకు పడితే కరెంట్ కట్.!

చినుకు పడితే కరెంట్ కట్.!

- Advertisement -

గంటల తరబడి కరెంట్ లేక తిప్పలు
నవతెలంగాణ – మల్హర్ రావు

వర్షాకాలం వచ్చిందంటే చాలు మండలంలో కరెంటు కష్టాలు మొదలవుతాయి.చిన్న గాలివానకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటం సర్వ సాధారణంగా మారింది. మండలంలో 15 గ్రామపంచాయతీలుండగా దాదాపు 25 అనుబంధ గ్రామాలు ఉన్నాయి. కాగా విద్యుత్ సరఫరా చేపట్టడం కోసం మండల కేంద్రమైన తాడిచెర్ల పాటు కొయ్యుర్ , మల్లారం, పెద్దతూండ్ల, నాచారం, రుద్రారం గ్రామాల్లో సబ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా మండలంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా చేపడుతున్నారు. గత కొన్ని రోజులుగా నిత్యం అప్రకటిత విద్యుత్ కోతలు ప్రారంభం కావడంతో మండల ప్రజలు ఇబ్బందులకు గురివుతున్నారు.

మండలానికి వచ్చే విద్యుత్ లైన్లు నాగులమ్మ అటవీ ప్రాంతం గుండా ఉండటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సమయంలో సమస్యను గుర్తించడం సిబ్బందికి కష్ట తరంగా మారుతుంది. దీంతో గంటల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. ఒక్కోసారి రాత్రంతా కూడా విద్యుత్ ఉండకపోవ డంతో ప్రజలు జాగారం చేయాల్సిన దుస్థితి నెల కొంటుంది. గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోవడం ద్వారా వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని వ్యాపారస్తులు తమ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. దీనికితోడు మండల కేంద్రంలోని మేజర్ జియో, బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్స్ విద్యుత్ లేని సమయంలో పని చేయడం లేదని పలువురు వాపోతున్నారు. దీంతో వేలాదిమంది సెల్ఫోన్లు మూగబోతున్నాయి. విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడకుండా ఉండడానికి, శాశ్వత పరిస్కారం కోసం 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

వెంటనే మరమ్మతులు చేపడుతున్నాం: శేఖర్ ఇంఛార్జి ఏఈ
“మండలంలో విద్యుత్ లైన్లు ఎక్కువ శాతం అటవీ ప్రాంతంలో ఉండటం ద్వారా వర్షాలు కురిసిన సమయంలో పిడుగులు పడి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. ఈదురుగాలులు వచ్చిన ప్రతీసారి విద్యుత్ లైన్ల మరమ్మతులు చేపడుతాం. ఇన్సులెటర్లు చెడి పోయిన చోట కొత్త ఇన్సులెటర్లను వేశాం. విద్యుత్ అంతరాయం లేకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.”

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -