నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం
52 రోజుల వేసవి సెలవుల తర్వాత
ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని బడులు తెరుచుకునేందుకు వేళైంది. 52 రోజుల వేసవి సెలవుల అనంతరం నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కొనసాగుతుండగా.. ఈ ఏడాది నుంచి విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం(బ్రేక్‌ఫాస్ట్)తోపాటు పాలు కూడా అందించనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, యూఆర్ఎస్‌లతోపాటు ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలలకు కూడా వేసవి సెలవులు కొనసాగాయి. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుంచి ప్రారంభమై జూన్ 11 వరకు కొనసాగనున్నట్టు 2025-26 విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండర్‌లోనే ప్రకటించారు. 49 రోజుల వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు జూన్ 12న పునః ప్రారంభమవుతాయని అందులో తెలిపారు. ఆ ప్రకారంగా 2026-27 విద్యా సంవత్సరం ఈ నెల 12 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. ప్రభుత్వానికి అందిన విజ్ఞప్తుల మేరకు పాఠశాలలను ఈనెల 15 నుంచి పునః ప్రారంభించాలని నిర్ణయించారు. ఆ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఈ నెల 7న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 13 రెండో శనివారం, 14 ఆదివారం ఉన్నందున అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలను ఈ నెల12కు బదులుగా 15న తిరిగి తెరవాలని నిర్ణయించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పాఠశాలల పునఃప్రారంభం వాయిదా పడటం వల్ల కోల్పోయిన విద్యా సమయాన్ని భర్తీ చేయడానికి 2026-27 విద్యా క్యాలెండర్ ప్రకారం నిర్ణయించిన బోధనా దినాలను ఖచ్చితంగా పాటించేలా చూసేందుకు, పాఠశాల విద్యా శాఖ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలకు జులై నెల రెండో శనివారాన్ని సాధారణ పనిదినంగా పరిగణించాలని నిర్ణయించినట్టు డైరెక్టర్ ప్రకటించారు. రాష్ట్రంలో 24,672 ప్రభుత్వ పాఠశాలలుండగా.. సుమారు 11వేల వరకు ప్రయివేటు పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాలలన్నీ సోమవారం పున:ప్రారంభం కానున్నాయి.
బడులకు వేళాయే!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



