గెలుపు

winగెలుపు అధికారం కోసం, ఆధిపత్యం కోసం అయినపుడు, తీవ్రమైన పోటీ ఏర్పడుతుంది. ఎలాగైనా సరే గెలవాలనే ఆలోచనతో యుద్ధం జరుగుతుంది. ప్రజాస్వామిక వ్యవస్థగా చెప్పుకొంటున్న పోటీలో, ప్రజలు గెలుస్తున్నారా! ప్రజాకాంక్షలు నెరవేరుతున్నాయా? అనేది ప్రశ్నగానే మిగులుతుంది. నేడు ఎన్నికలలో నిజాయితీగా ప్రజాభిమానాన్ని గెలుచుకుని నిలబడిన నాయకులు ఎంతమంది ఉన్నారు! నిజమైన ప్రజానాయకులకు ఈ ఎన్నికల పోటీలో స్థానముంటున్నదా! ఇవన్నీ గెలుపులు తేలాక సమీక్షించుకోవాల్సిన విషయాలు.
గెలుపు ఎవరికైనా బోలెడంత సంతోషాన్ని, ఉత్సాహాన్నీ ఇస్తుంది. గెలుపోటములన్నీ మన సామాజిక నిర్మాణాల్లోంచి వచ్చినవే. అసలు గెలవటం అంటే ఏమిటో నిర్వచించుకుంటే ఓటమి కుంగుబాటూ, నిరు త్సాహము అనే వాటిని గెలవగలుగుతాము. గెలుపంటే విజయం అని కూడా. పూర్వము రాజులు రాజ్యాల కోసం యుద్ధం చేసి, ఎదుటి రా జ్యాన్ని ఆక్రమించుకోవటాన్ని విజయమని పేర్కొనేవాళ్లు. రాజ్యమే కాదు, ఏదైనా పోటీ పడటంలోనే గెలుపు అనేది వస్తుంది. ఆటలు, చదువులు, కుస్తీలు అన్నీ నేడు పోటీలే. జ్ఞాన సముపార్జనలోనూ పోటీలు, గెలు పోటములు, సంపాదన, ఖర్చుల్లోనూ ఇది పెరిగిపోయింది. పెట్టుబడి దారీవిధాన ఫలితం ప్రతి అంశంలోనూ ఈ పోటీని, గెలుపు ఓటమిని తీసుకువచ్చింది. అయితే మంచితనం, మానవీయత కలిగి వుండటంలో ఈ పోటీతత్వం లేదు. నిజాయితీ, విలువలుగల ఉన్నత జీవనంలో ఈ పోటీలు లేవు. ఎందుకంటే వీటి వెనకాల ధనానికి, వ్యాపారానికి అవ కాశం లేదు. పోటీలు పెరిగిన ప్రతి అంశం వెనకాల వ్యాపా రాత్మక ధన ప్రమేయాన్ని మనం చూస్తాము.
వెలుగునంటుకొని చీకటి వున్నట్లుగానే, కుడి ఎడమలున్నట్లే గెలు పున్నచోటే ఓటమీ వుంటుంది. అయితే ఏ గెలుపూ శాశ్వతం కానట్లే ఓటమీ శాశ్వతం కాదు. ఈ వ్యవస్థలో ఎప్పటికీ కొన సాగేది పోటీ మాత్రమే. నెగ్గినవాడు తానధికుడని భావిస్తాడు. ఓడినవారు కొందరు నిరాశకు లోనయి కుంగిపోతారు. మరి కొందరు కసితో రగిలిపోతారు. ఇంకొందరేమో ఓటమి కారణా లను సమీక్షించుకొని పాఠాలు నేర్చుకుంటారు. తిరిగి గెలుపు కోసం ప్రయత్నాలు మొదలెడతారు. గెలిచిన వారిలో కొందరు నమ్రతగా వ్యవహరించి తమ గెలుపు కొనసాగేట్లు చూసుకుం టారు. క్రీడలలో మాత్రం ఆడటమే ఉత్సాహాన్ని నింపుతుంది. గెలుపు ఓటములనేవి ఆటలో ఒక భాగం మాత్రమే. కానీ ఆటకూ మతాన్ని, కులాన్ని, ప్రాంతాన్ని అంటగట్టి గెలుపు ఓట ములు లెక్కించినపుడు, అవి విభేదాలకు, విద్వేషాలకు దారి తీస్తాయి. ఓటమిని జీర్ణించుకోలేనితనమూ ఏర్పడుతుంది. ఆటలదలా వుంచితే. గెలుపు అధికారం కోసం, ఆధిపత్యం కోసం అయినపుడు, తీవ్రమైన పోటీ ఏర్పడుతుంది. ఎలాగైనా సరే గెలవాలనే ఆలోచనతో యుద్ధం జరుగుతుంది. ప్రజాస్వామిక వ్యవస్థగా చెప్పుకొంటున్న పోటీలో, ప్రజలు గెలుస్తున్నారా! ప్రజా కాంక్షలు నెరవేరుతున్నాయా? అనేది ప్రశ్నగానే మిగులుతుంది. నేడు ఎన్నికలలో నిజాయితీగా ప్రజాభిమానాన్ని గెలుచుకుని నిలబడిన నాయకులు ఎంతమంది ఉన్నారు! నిజమైన ప్రజా నాయకులకు ఈ ఎన్నికల పోటీలో స్థానముంటున్నదా! ఇవన్నీ గెలుపులు తేలాక సమీక్షించుకోవాల్సిన విషయాలు.
గెలవడం కోసం మనం ఎన్నిసార్లు మనుషులుగా ఓడిపోతున్నామో ఎపుడైనా ఆలోచించామా! గెలవడం కోసం నిజాయితీని, నీతిని, ధర్మా న్ని, న్యాయాన్ని ఎంత ఫణంగా పెడతామో! ఎన్నికల సందర్భంగానైతే, డబ్బును, మద్యాన్ని, కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, అన్నింటినీ పోటీలో తమకు బదులుగా నిలబెడతాంకదా! అంతేకాదు, బెదిరింపులకు, బల ప్రయెగాలకు, హతమార్చడానికి, హత్యలకూ పూనుకుంటాము. ఇవన్నీ ప్రయోగించిన మీదట గెలిచినది ఎవరని ఒకసారి ప్రశ్నించుకుంటే, వ్యక్తులది గెలుపు కాదని తెలిసిపోతుంది. అపుడు గెలవటమనేది నిలు వెత్తు ఓటమిలా కపనడుతుంది. నేటి ఎన్నికలలోనయితే గెలిచిన వారం దరి గెలుపు వారిదికానే కాదు. డబ్బు ఆధిపత్యం గల సమాజంలో ప్రతిదీ డబ్బు సాధించేదే. డబ్బే అన్ని కొనిపెడుతుంది. అమ్మిపెడుతుంది కూడా.
అయినా ఈ గెలుపే అధికారాన్ని తెచ్చి పెడుతుంది. ఎవరు తమ గెలుపుకు కారణమో వారివైపే గెలిచిన వారు నిలుస్తారనేది. చెప్పక పోయినా తెలిసే విషయం. ఆ విషయాలెలా వున్నా, గెలుపు వెనకాల ఎన్నో ఓటములు దాగున్నాయని అర్థం చేసుకోవాలి. గెలుపోటముల గూర్చి సామాజిక విమర్శకులేమంటారంటే, ‘గెలుపు నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తే ఓటమి, నీకు ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది’ అని కాబట్టి ఈ గెలుపోటములను అర్థం చేసుకుని, పాఠాలను తీసుకుని భవిష్యత్తును నిర్మంచుకోవటమే మనం నిరంతరం చేయాల్సిన పని. ఈ సామాజిక పరిణామక్రమంలో వెనక్కు తిరగకుండా ముందుకు మునుముందుకు కదలిపోవటమే నిజమైన గెలుపు. విలువలను, మానవీయతను వొదిలివేయటమే ఓటమి.

Spread the love