బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరు రామచంద్రారెడ్డి
నవతెలంగాణ-ఆలేరు టౌన్
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆలేర్ పట్టణంలో బుధవారం అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ సంవిధాన్ పేరా అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయాలని కోరుతుండగా.. ఆలేరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రాజ్యాంగం నడుస్తుందని విమర్శించారు.
గత కొన్ని రోజులుగా ప్రభుత్వ కార్యాలయాలు రెవిన్యూ, పోలీస్ స్టేషన్ ఇతర కార్యాలయాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చెప్పిన విధంగా నడుస్తున్నాయన్నారు. ప్రభుత్వ అధికారులు సామాన్యుల సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించినప్పుడు, పాలకులు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. అభివృద్ధి పనులలో సోషల్ మీడియాలో చేసుకుంటున్నా ప్రచారానికి, పనులకు పొంతన లేకుండా ఉం తుర్కపల్లి మండలం తిరుమలపురం గ్రామంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి చే నిర్వహించిన బహిరంగ సభలో చెప్పిన విధంగా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. గంధ మల్ల రిజర్వాయర్ నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సొంత వ్యాపారాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, ఆలేరు నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులపై జూలు మానుకోవాలన్నారు. ఈ నాయకుడికైనా ప్రజలే బాస్ అని చెప్పారు. ప్రజలకు అనుగుణంగా పాలన సాధించాలన్నారు. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై బిఆర్ఎస్ పార్టీ ఉద్యమిస్తుందని తెలియజేశారు. ధాన్యం కొనుగోలుకు కృషి చేసిన అధికారులని అభినందించారు. ఈ సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ పట్టణ మండల అధ్యక్షులు పుట్ట మల్లేశం, గంగుల శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ మొగలిగాని మల్లేశం, మున్సిపల్ కౌన్సిలర్ యాట శివ, మాజీ కౌన్సిలర్ బేతి రాములు, ఆడెపు బాలస్వామి, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.



