నవతెలంగాణఆలేరు టౌన్
వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల, కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుతూ, ఆలేరు పట్టణంలో బుధవారం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు నిరసన తెలియజేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ స్వప్న రాథోడ్ కు వినతిపత్రం అందజేశారు. గత కొన్ని నెలల నుండి వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు 104, శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్, ఉద్యోగ కార్మికులకి ఒక్కరికి లక్ష మేర బకాయలు ఉన్నాయని, జీతాలు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుకుంటున్నారని చెప్పారు. కుటుంబ ఖర్చులు భారంతో కష్టంగా మారిందని, వెంటనే సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని వినతిలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు, శానిటేషన్, 104, కేర్ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల, కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



