Thursday, July 9, 2026
E-PAPER
Homeఆదిలాబాద్బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థినికి గాయాలు

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థినికి గాయాలు

- Advertisement -

ఘటనపై పలు అనుమానాలు ..?
నవతెలంగాణ – ముధోల్
బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థిని తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విద్యార్థిని భవనంపై నుంచి పడి అనుమానాస్పద స్థితిలో గాయాలపాలైంది. విద్యార్థిని సంబంధిత భవనంపై నుంచి దూకిందా? లేక ప్రమాదవశాత్తు జారి పడిందా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఘటనకు గల కారణాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం బయటకు రాకుండా  ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు రావడంతో  మరింత అనుమానాలకు బలం చేకూరింది. ఘటన జరిగిన విషయం పోలీసులకు ట్రిపుల్ ఐటీ అధికారులు సకాలంలో  తెలియజేయలేదన్న ఆరోపణలు రావడం గమనార్హం. గాయాలపాలైన విద్యార్థినిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. దింతో ఈ విషయం తెలుసుకున్న బైంసా ఏఎస్పీ సాయికిరణ్ ట్రిపుల్ ఐటీకి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి, పలు వివరాలను ట్రిపుల్ ఐటీ వీసీ గోవర్ధన్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేక మరే ఏమైనా కారణాలు ఉన్నాయా? అన్న విషయాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -