- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట కు చెందిన కట్రం రక్షిత శ్రీ జేఈఈ మెయిన్స్ పేపర్ 1 ఫలితాల్లో ఆల్ ఇండియా లెవెల్ లో 95.699 శాతం సాధించింది. విద్యార్థిని కట్రం రక్షిత శ్రీ ప్రస్తుతం ఫిడ్జి ఇంటర్ కాలేజ్ మియాపూర్ హైదరాబాదులో విద్యనభ్యసిస్తున్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని తండ్రి టీడీపీ అశ్వారావుపేట నియోజకవర్గ ఇంచార్జ్ కట్రం స్వామి దొర కాగా, తల్లి రాజేశ్వరి ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు.కట్రం రక్షిత శ్రీ ఉత్తమ ర్యాంకు సాధించడం పట్ల తల్లిదండ్రులు కట్రం స్వామి దొర – రాజేశ్వరి లు హర్షం వ్యక్తం చేశారు.
- Advertisement -



