Thursday, June 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసర్‌‌కు సహకరించాలి

సర్‌‌కు సహకరించాలి

- Advertisement -

ఆంగ్ల భాషలోనే ఎన్యుమరేషన్ ఫారాలు
జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌‌వి. కర్ణన్
పార్టీల నేతలతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం


నవతెలంగాణ-సిటీబ్యూరో

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు రాజకీయ పార్టీలు సహకరించాలని జీహెచ్‌ ఎంసీ కమిషనర్, హైదరాబాద్‌ జిల్లా ఎన్నిక‌ల అధికారి ఆర్.వి. కర్ణన్ అన్నారు. జిల్లాలో పారదర్శకమైన, సమగ్రమైన, ఎలాంటి లోపాలూ లేని ఓటర్ల జాబితాను రూపొందించడమే లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ కసరత్తు ముమ్మరం చేసింది. గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ‌బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (స‌ర్‌) ప్రక్రియపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఓటర్ల వివరాల సేకరణను మరింత సులభతరం చేసేందుకు, ఖచ్చితత్వంతో కూడిన జాబితా సిద్ధం చేయడానికి అర్హులైన ఓటర్లందరికీ ఆంగ్ల భాషలోనే ఎన్యుమరేషన్ (వివరాల సేకరణ) ఫారాలను పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు. క్షేత్రస్థాయిలో పర్యటించే బూత్ స్థాయి అధికారులకు (బీఎల్ఓలు) రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఓటర్లు పూర్తి సహకారం అందించాలని కోరారు. నిర్ణీత గడువులోగా పూర్తి చేసిన ఫారాలను సమర్పించని వారి పేర్లు ముసాయిదా ఓటర్ల జాబితాలో చేర్చకపోవచ్చని ఆయన స్పష్టం చేశారు. కొత్త ఓటర్ల నమోదు (ఫామ్-6), మార్పులు-చేర్పుల (ఫామ్-8) కోసం బూత్ స్థాయి అధికారులకు అపరిమితంగా ఫారాలను అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఓటర్ల సవరణ ప్రక్రియలో ఎదురవుతున్న పలు సాంకేతిక, ఆచరణాత్మక ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా, అదనపు కమిషనర్ (ఎన్నికలు) కుమారి కె. చంద్రకళ‌, వివిధ పార్టీల ముఖ్య నేతలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -