Tuesday, February 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఊరుకొండలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు..

ఊరుకొండలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు..

- Advertisement -

– స్వరాష్ట్ర సాధనలో అలుపెరుగని పోరాటం చేసిన కేసీఆర్
– స్వీట్లు పండ్లు పంపిణీ చేసిన బీఆర్ఎస్ నేతలు
నవతెలంగాణ – ఊరుకొండ 

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు.. స్వరాష్ట్ర సాధనలో పలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమ వీరుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను ఊరుకొండ మండల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఊరుకొండ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో జనహృదయనేత.. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ జన్మదినోత్సవంలో భాగంగా ముందుగా ఊరుకొండ మండల పరిధిలోని ఊరుకొండ పేట అభయాంజనేయ స్వామి దేవాలయంలో కెసిఆర్ పేరు మీద  అర్చన, అభిషేకం, ప్రత్యేక పూజలను నిర్వహించారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వీరారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంత ఆత్మగౌరవ ప్రతీకను దోపిడీదారుల చెరసాల నుండి కాపాడిన.. పోరాటల గడ్డపై ఉద్భవించిన వీర పుత్రుడు.. స్వరాష్ట్ర సాధనలో అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమ వీరుడు మహోన్నమైన వ్యక్తిత్వం కలిగిన జన హృదయనేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని కొనియాడారు. కేసీఆర్ తన పాలనలో రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ రైతు బంధు, రైతు భీమా వంటి పథకాల ద్వారా రైతులకు ఆర్థిక భరోసా కల్పించారన్నారు.

వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా చేసి రైతుల అభివృద్ధికి కృషి చేశారని వారి సేవలు మరువలేనివని తెలిపారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షులు ద్యాప వీరారెడ్డి ఆధ్వర్యంలో మండల బిఆర్ఎస్ నాయకులు మండల కేంద్రంలో జాతీయ రహదారి పై కేకు కట్ చేసి టపాకాయలు కాల్చి  జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం ఊర్కొండ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు, వృద్ధులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు యువజన విభాగం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -