Thursday, June 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగత ప్రభుత్వం కంటే 
కాంగ్రెస్ పాలన అధ్వాన్నం

గత ప్రభుత్వం కంటే 
కాంగ్రెస్ పాలన అధ్వాన్నం

- Advertisement -

రాష్ర్టాన్ని ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్న మంత్రులు :
టీఆర్‌ఎల్డీ రాష్ట్ర అధ్యక్ష‍ులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌‌కుమార్‌
‌నవతెలంగాణ-హైదరాబాద్‌

​గత ప్రభుత్వం కంటే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధ్వాన్నంగా పనిచేస్తుందని టీఆర్‌ఎల్‌‌డీ రాష్ట్ర అధ్యక్ష‍ులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌‌కుమార్‌ అన్నారు. రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు రాష్ట్రాన్ని ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా హుజూర్‌‌నగర్‌‌లో తెలంగాణ రాష్ట్రీయ లోక్‌ ‌దళ్ (టీఆర్‌ఎల్‌‌డీ) కార్యాలయాన్ని దిలీప్‌‌కుమార్‌ ‌చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎల్‌‌డీ సూర్యాపేట జిల్లా అధ్యక్ష‍ులు నరేందర్‌ ‌గౌడ్‌, టీఆర్‌ఎల్‌‌డీ అధికార ప్రతినిధి బీరప్ప, టీఆర్‌ఎల్‌‌డీ కోశాధికారి గిరికుండే, ప్రధాన కార్యదర్శులు నరసింహరావు, విశాల్‌ ‌వంజరి, శరిషబ్‌ ‌జైన్‌ ‌తదితర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దిలీప్‌‌కుమార్‌ ‌మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి సమర్దవంతమైన పాలన అందించడంలో విఫలమయ్యారని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజాసంక్ష‍ేమం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని అన్నారు. ప్రజల ఆకాంక్ష‍లకు దూరంగా ఉన్న అసమర్ధ ప్రభుత్వంగా కొనసాగుతుందని అభివర్ణించారు. యువతను స్వచ్ఛమైన, పారదర్శకమైన రాజకీయాల్లోకి ప్రోత్సహించేందుకు, నిజాయితీ, నిబద్ధతతో ప్రజాసేవ చేయడానికి పునరుద్దరిద్దామని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థలు, అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎల్డీ పోటీ చేస్తుందని అన్నారు.

జూన్‌ 27న వరంగల్లో టీఆర్‌ఎల్డీ జాతీయ అధ్యక్ష‍ులు, భారత ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపకత శాఖ కేంద్ర మంత్రి జయంత్‌ ‌సింగ్‌ ‌మార్గదర్శకంలో భారీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్టు తెలిపారు. లక్ష‍ం కోసం లక్ష‍ సైన్యం పేరుతో ఒక ప్రత్యేక యువజన కార్యక్రమాన్ని జూన్‌ 27న వరంగల్‌‌ నుంచి ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. పదవీ విరమణ పొందిన సైనిక అధికారుల సహకారంతో నిర్వహించనున్న ఈ కార్యక్రమం ద్వారా యువతకు నాయకత్వ లక్ష‍ణాలు, దేశసేవా భావం, ప్రజాసేవా దృక్పథం పెంపొదించడంతో పాటు వారికి శిక్ష‍ణ మార్గదర్శకత్వం అందించనున్నట్టు తెలిపారు. బీరప్ప మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ‌పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేశాయని, ప్రత్యేక తెలంగాణ కోసం ప్రజలు పెట్టుకున్న ఆశయాలు ఇప్పటికీ నెరవేరలేదని అన్నారు. నరేందర్‌ ‌గౌడ్‌ ‌మాట్లాడుతూ స్థానిక మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి కొత్త రేషన్‌‌కార్డులు, డబుల్‌ ‌బెడ్రూమ్‌ ఇండ్లు, పెండింగ్‌ ‌ఫీజు రీయింబర్స్ మెంట్‌ ‌బకాయిల చెల్లింపు వంటి అనేక హామీలు ఇచ్చారని అన్నారు. అయితే ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేరలేదని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -