నవతెలంగాణ – భీంగల్
తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించడమే కాకుండా అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేసిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) జన్మదిన వేడుకలను భీంగల్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ….బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన పోరాడుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ చేసిన ఉద్యమం, పట్టుదల, నాయకత్వం రాష్ట్ర రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, రైతు సంక్షేమం మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రజల జీవితాలలో కీలక మార్పులు తీసుకొచ్చాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల కలలు సాకారం కావాలంటే రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలని కోరారు. కేసీఆర్ పై భగవంతుడి ఆశీర్వాదం తో నిండు నూరేళ్లు ఆయురోగ్యాలతో ఉండాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు దొనకంటి నర్సయ్య,5వ వార్డు కౌన్సిలర్ పొదిలి లావణ్య (నర్సయ్య), 9 వార్డు కౌన్సిలర్ నీలం రవి, 12వ వార్డ్ కౌన్సిలర్ మల్లెల అనుపమ (ప్రసాద్), మాజీ ఎంపీపీ ఆర్మూర్ మహేష్, జడ్పీటీసీ చౌట్పల్లి రవి, ఉపాధి నర్సయ్య, నీలం గంగాధర్, శర్మ నాయక్, బోర్ లింగం, శెవ్వ అశోక్, గోపి, తుక్కాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.



