Thursday, June 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంహైదరాబాద్‌ ఐటీ రంగంలో 
మరో ముందడుగు

హైదరాబాద్‌ ఐటీ రంగంలో 
మరో ముందడుగు

- Advertisement -

గచ్చిబౌలిలో ఓట్రిజ్‌ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన కేటీఆర్‌
​నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రముఖ టెక్నాలజీ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కంపెనీ ‘ఓజ్రిట్’ నూతన కార్యాలయాన్ని బుధవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ‌బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, మాజీమంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) ప్రారంభించారు. కంపెనీ నూతన లోగోను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఓజ్రిట్ బృందంతో ఆయన ఉత్సాహంగా ముచ్చటించారు. సంస్థ ఫౌండర్ అండ్ సీఈఓ భరత్ గుప్తా, కో-ఫౌండర్ అండ్ సీఓఓ వివేకానంద రెడ్డి తదితర నాయకత్వ బృందంతో కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమై పలు కీలక విషయాలపై చర్చించారు. తెలంగాణను భారతదేశంలోనే అగ్రగామి టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌గా మార్చడంలో కేటీఆర్ చేసిన కృషిని, ఆయన దార్శనికతను ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు ప్రత్యేకంగా గుర్తు చేశారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు మాట్లాడుతూ.. “కేటీఆర్ ప్రోత్సాహం, ఆయన సాంకేతిక ఆధారిత అభివృద్ధి లక్ష్యాల స్ఫూర్తితోనే ఓజ్రిట్ స్థాపించబడిందని వివరించారు. ఆవిష్కరణలు, ఆంత్రప్రెన్యూర్‌షిప్, ఉపాధి కల్పనపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టడం వల్లే ఇలాంటి సంస్థలు తెలంగాణ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించి వృద్ధి చెందడానికి ప్రేరణగా నిలిచాయన్నారు. భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు సృష్టించడం, టైర్-2 (ద్వితీయ శ్రేణి) నగరాలకు తమ కార్యకలాపాలను విస్తరించడంపై దృష్టి పెట్టామని అన్నారు. రాబోయే సంవత్సరాల్లో తమ ఉద్యోగుల సంఖ్యను వెయ్యి మందికి పైగా పెంచుతామని చెప్పారు. ఈ ఐటీ ఎకోసిస్టమ్‌కు తమ వంతు సహకారం అందించడానికి పూర్తి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. గచ్చిబౌలిలో ఈ కొత్త కార్యాలయ ఏర్పాటు ఓజ్రిట్ వృద్ధి ప్రయాణంలో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలవనుందని వివరించారు. హైదరాబాద్‌ను గ్లోబల్ టెక్నాలజీ డెస్టినేషన్‌గా మరింత బలోపేతం చేయడంతోపాటు, తెలంగాణ అంతటా నాణ్యమైన ఉపాధి అవకాశాలను సృష్టించడంలో కంపెనీ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -