నవతెలంగాణ – ముధోల్ : బాసర ట్రిపుల్ ఐటీలో బుధవారం జరిగిన ఘటనలో విద్యార్థిని తీవ్ర గాయాలు పాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. విద్యార్థిని నిజామాబాద్ ఆస్పత్రికి తరలించినప్పటికీ గాయాలు, నొప్పి తీవ్రంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారులతో మాట్లాడి విద్యార్థికి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు పంపేందుకు చర్యలు తీసుకున్నాట్లు సమాచారం. దీంతో విద్యార్థికీ నిజామాబాద్ ఆస్పత్రి నుంచి బుధవారం రాత్రి హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కలెక్టర్, ఎస్పీ ప్రత్యేక చొరవ తీసుకోవడంతోనే విద్యార్థికి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించినట్టు తెలుస్తుంది.
కలెక్టర్, ఎస్పీ చొరవతో..ట్రిపుల్ ఐటీ విద్యార్థికి మెరుగైన వైద్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



