- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: జూన్ 30న రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. రైతు భరోసా నిధుల విడుదలకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మధిరలో జరిగే భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ ఈ నిధులను విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా పథకం కింద మూడో విడత నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధం కావడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం మొత్తం 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందిస్తోంది. ఎకరానికి సంవత్సరానికి రూ.12వేల చొప్పున, యాసంగి సీజన్‌కు రూ.6వేల చొప్పున నిధులు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.
- Advertisement -



